మళ్లీ షానే
బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా రెండోసారి ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్ష పదవికి అమిత్ షా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. షాను ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్ధించారు. అమిత్ షా ఈ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగుతారు. 2014 ఎన్నికల తర్వాత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్‌లో చేరడంతో ఆయన స్థానంలో అమిత్ షా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.