Telugu Global
Others

చెవిరెడ్డి స్టేట్ మొత్తం తిరగాల్సిందే!

వైసీపీ ప్రజాప్రతినిధులను ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో టార్గెట్ చేసినట్టుగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలో ఈ పరిస్థితి కాస్త శృతి మించినట్టు ఉంది. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి చేసిన కేసులో మిథున్‌ రెడ్డిని ఇప్పటికే జైల్లో పెట్టిన పోలీసులు…. చెవిరెడ్డి విషయంలో మరింత దూకుడుగా పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆందోళన కేసుపై ఐదు రోజుల క్రితం తొలుత చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజే 2009లో గోడలపై జై జగన్ అంటూ నినాదాలు రాశారంటూ […]

చెవిరెడ్డి స్టేట్ మొత్తం తిరగాల్సిందే!
X

వైసీపీ ప్రజాప్రతినిధులను ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో టార్గెట్ చేసినట్టుగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలో ఈ పరిస్థితి కాస్త శృతి మించినట్టు ఉంది. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి చేసిన కేసులో మిథున్‌ రెడ్డిని ఇప్పటికే జైల్లో పెట్టిన పోలీసులు…. చెవిరెడ్డి విషయంలో మరింత దూకుడుగా పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆందోళన కేసుపై ఐదు రోజుల క్రితం తొలుత చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజే 2009లో గోడలపై జై జగన్ అంటూ నినాదాలు రాశారంటూ చెవిరెడ్డిని మరోసారి అరెస్ట్ చేశారు. నెల్లూరు జైలు నుంచి పీలేరు కోర్టుకు తరలించారు. తిరిగి నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు. తాజాగా మరో కేసులో చెవిరెడ్డిని టార్గెట్ చేశారు. ఈసారి రాజమహేంద్రవరానికి చెవిరెడ్డి తరలింపు . గతేడాది సెప్టెంబర్‌లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణపై అప్పట్లో చెవిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పుడు చెవిరెడ్డికి రాజమండ్రి చూపిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే చెవిరెడ్డిని చంద్రబాబు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరని అభిప్రాయపడుతున్నారు. చెవిరెడ్డిపై గతంలో ఉన్న కేసులనూ తిరగదోడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

First Published:  23 Jan 2016 4:35 AM IST
Next Story