ఈ వీకెండ్ కూడా సంక్రాంతి హీరోలదే
సంక్రాంతి తర్వాత ఇప్పటికే ఓ వీకెండ్ పూర్తయింది. మరో వీకెండ్ కోసం ఆశించడం సంక్రాంతి సినిమాలకు అత్యాశే అవుతుంది. కానీ ఎందుకో అన్నీ అనుకోకుండా అలా కలిసొచ్చేస్తున్నాయి. దీంతో ఈవారం కూడా సంక్రాంతిసినిమాలే థియేటర్లలో కొనసాగనున్నాయి. నిజానికి ఈ శుక్రవారం విశాల్ నటించిన కథాకళి….. నాగశౌర్య చేసిన కల్యాణ వైభోగమే సినిమాల్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కథాకళి సినిమా సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. ఇక నాగశౌర్యకు భారీ సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడం వల్ల ఆగిపోయింది. దీంతో […]
BY sarvi23 Jan 2016 12:35 AM IST
X
sarvi Updated On: 23 Jan 2016 5:03 AM IST
సంక్రాంతి తర్వాత ఇప్పటికే ఓ వీకెండ్ పూర్తయింది. మరో వీకెండ్ కోసం ఆశించడం సంక్రాంతి సినిమాలకు అత్యాశే అవుతుంది. కానీ ఎందుకో అన్నీ అనుకోకుండా అలా కలిసొచ్చేస్తున్నాయి. దీంతో ఈవారం కూడా సంక్రాంతిసినిమాలే థియేటర్లలో కొనసాగనున్నాయి. నిజానికి ఈ శుక్రవారం విశాల్ నటించిన కథాకళి….. నాగశౌర్య చేసిన కల్యాణ వైభోగమే సినిమాల్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కథాకళి సినిమా సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. ఇక నాగశౌర్యకు భారీ సంఖ్యలో థియేటర్లు దొరక్కపోవడం వల్ల ఆగిపోయింది. దీంతో సంక్రాంతి విడుదలైన సినిమాలే ఈ వారం కూడా కొనసాగనున్నాయి. మరీ ముఖ్యంగా డిక్టేటర్ ఫ్లాప్ టాక్ తో ఆ సినిమా థియేటర్లలో కొన్నింటిని సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్ ప్రెస్ రాజాకు కేటాయించారు. ఇంకోవైపు నాన్నకు ప్రేమతో సినిమాకు కూడా రెస్పాన్స్ పెరుగుతోంది. మరో వీకెండ్ దొరకడంతో….. నాగార్జున 40కోట్ల క్లబ్ పై…. ఎన్టీఆర్ 60కోట్ల క్లబ్ పై కన్నేశారు. ఇక శర్వానంద్ విషయానికొస్తే… ప్రతి షో ప్రాఫిట్టే అతడికి.
Next Story