మనోళ్లు లావైపోతున్నారు!
దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పలు ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. పట్టణాలకు, పల్లెలకు మధ్య వ్యాదుల విషయంలో తేడాలు ఉన్నట్టు తేల్చింది. అందుకు కారణాలు కూడా వెల్లడించింది. పల్లెవాసుల్లో రక్తపోటు అధికంగా ఉన్నట్టు సర్వేలో తేలింది. అలాగే పట్టణవాసుల్లో ఊబకాయం అధికంగా ఉంది. పట్టణవాసులు సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో ఊబకాయం బారిన పడుతున్నట్టు సర్వే నివేదిక చెబుతోంది. 2005 నాటికి […]
దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పలు ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. పట్టణాలకు, పల్లెలకు మధ్య వ్యాదుల విషయంలో తేడాలు ఉన్నట్టు తేల్చింది. అందుకు కారణాలు కూడా వెల్లడించింది. పల్లెవాసుల్లో రక్తపోటు అధికంగా ఉన్నట్టు సర్వేలో తేలింది. అలాగే పట్టణవాసుల్లో ఊబకాయం అధికంగా ఉంది. పట్టణవాసులు సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో ఊబకాయం బారిన పడుతున్నట్టు సర్వే నివేదిక చెబుతోంది. 2005 నాటికి ఇప్పటికీ దేశంలో ఊబకాయం స్థాయి భారీగా పెరిగింది. ఒక్క పుదుచ్చేరిలో మాత్రమే ఊబకాయం తక్కువగా ఉంది. ఏపీలో 10 వేల కుటుంబాలకు సర్వే చేయగా పట్టణ ప్రాంతంలో 45.6 శాతం మంది మహిళలు ఓవర్ వెయిట్‌తో ఉన్నారు. ఈ శాతం దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అధికం. ఏపీ గ్రామీణ మహిళల్లో ఊబకాయం 27.6 శాతంగా ఉంది. దేశం మొత్తం మీద చూస్తే మహిళల్లో 2005లో 13. 92 శాతం ఉన్న ఊబకాయం ఇప్పుడు 19.56 శాతానికి పెరిగింది. పురుషుల్లో ఈ మొత్తం 10. 35 శాతం నుంచి 18.04శాతానికి పెరిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది.