సాక్ష్యమంటే లోకేష్ ఫొటోలా ఉండాలట!
ప్రతిపక్ష వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై వరుసగా కేసు నమోదు చేయడం పట్ల వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై ఎంపీ మిథున్ రెడ్డి దాడి చేశారంటూ తప్పుడు కేసు నమోదు చేశారని విమర్శించారు. మిథున్ రెడ్డి దాడి చేయడం నిజమని నమ్మించేందుకు కొన్ని వీడియో క్లిప్పింగులు వదిలి జనాన్ని తికమకపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో మిథున్ రెడ్డి దాడి చేస్తున్నట్టు ఎక్కడుందని ప్రశ్నించారు. సాక్ష్యాలంటే స్పష్టంగా ఉండాలంటూ గతంలో […]
ప్రతిపక్ష వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై వరుసగా కేసు నమోదు చేయడం పట్ల వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై ఎంపీ మిథున్ రెడ్డి దాడి చేశారంటూ తప్పుడు కేసు నమోదు చేశారని విమర్శించారు. మిథున్ రెడ్డి దాడి చేయడం నిజమని నమ్మించేందుకు కొన్ని వీడియో క్లిప్పింగులు వదిలి జనాన్ని తికమకపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో మిథున్ రెడ్డి దాడి చేస్తున్నట్టు ఎక్కడుందని ప్రశ్నించారు. సాక్ష్యాలంటే స్పష్టంగా ఉండాలంటూ గతంలో విదేశాల్లో మహిళలతో కలిసి లోకేష్ దిగిన ఫోటోలను అంబటి ప్రదర్శించారు. మహిళలతో కలిసి లోకేష్ మద్యం తాగుతున్న, స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేస్తున్న ఫోటోలను మీడియాకు చూపెట్టారు. ఈ ఫోటోలు బయటకొచ్చి చాలాకాలమైనా నోరు విప్పని లోకేష్ ఇప్పుడు వీడియో పుటేజ్ ఆధారంగా జగన్ రాజీనామా చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతోకాలం పాలించలేరన్నారు. ఐపీఎస్‌లు కూడా చంద్రబాబుకు లొంగిపోవడం సరికాదన్నారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టే స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారడం ప్రమాదకరమైన సాంప్రదాయమన్నారు అంబటి.
Click on Image to Read: