Telugu Global
Cinema & Entertainment

కనీసం ఈ ఏడాదైనా తెరపైకి వస్తాడా ?

కమెడియన్ గా కొనసాగి ఉండుంటే… గతేడాది కనీసం డజను సినిమాలు చేసి ఉండేవాడు. కానీ హీరోగా మారిపోవడంతో…. తెరపైక ఒక్కసారి కూడా కనిపించలేదు సునీల్. అవును…. 2015లో సునీల్ నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదలకాలేదు. దీనికి కారణం వరుస ఫ్లాపులే. 2014లో భీమవరం బుల్లోడు, కేఎస్ డీ అప్పల్రాజు, మిస్టర్ పెళ్లికొడుకు లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో…. 2015 అంతా గ్యాప్ తీసుకున్నాడు సునీల్. కనీసం 2016 లో అయినా సక్సెస్ కొట్టాలని ఆశపడుతున్నాడు. […]

కనీసం ఈ ఏడాదైనా తెరపైకి వస్తాడా ?
X

కమెడియన్ గా కొనసాగి ఉండుంటే… గతేడాది కనీసం డజను సినిమాలు చేసి ఉండేవాడు. కానీ హీరోగా మారిపోవడంతో…. తెరపైక ఒక్కసారి కూడా కనిపించలేదు సునీల్. అవును…. 2015లో సునీల్ నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదలకాలేదు. దీనికి కారణం వరుస ఫ్లాపులే. 2014లో భీమవరం బుల్లోడు, కేఎస్ డీ అప్పల్రాజు, మిస్టర్ పెళ్లికొడుకు లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో…. 2015 అంతా గ్యాప్ తీసుకున్నాడు సునీల్. కనీసం 2016 లో అయినా సక్సెస్ కొట్టాలని ఆశపడుతున్నాడు. వాసువర్మ దర్శకత్వంలో కృష్ణాష్టమి అనే సినిమా చేసిన ఈ హీరో…. ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా విజయంతో 2016ను ఘనంగా ప్రారంభించాలనుకుంటున్నాడు. ఇప్పటికే ప్రతి పండక్కి, ప్రతి ఈవెంట్‌కు కృష్ణాష్టమికి సంబంధించిన ఫస్టులుక్కులు, టీజర్లు విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే సినిమా విడుదల ఎప్పుడనేది మాత్రం దిల్ రాజు చేతిలో ఉంది. ఎలాంటి కాంపిటిషన్ లేని టైమ్ లో వచ్చి కూల్ హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు సునీల్.

First Published:  22 Jan 2016 12:36 AM IST
Next Story