Telugu Global
Others

టీడీపీకి వెన్నుపోటు కొత్తకాదు

టీడీపీ, బీజేపీ మధ్య బంధం చాలా ధృడమైనది. వీరి బంధమంత ధృడమైన సిమెంట్ కూడా ఇంకా రాలేదు. దశాబ్ధాల రాజకీయంలో బీజేపీ భుజం మీద కాలు పెట్టి టీడీపీ గోడ దాటిన ఉదంతాలే కనిపిస్తాయి. టీడీపీ గోడ ఎక్కిన తర్యాత బీజేపీ కూడా అదే గోడ దూకాలని చూస్తుంది. కానీ టీడీపీ నుంచి పోటే మిగులుతుంది. ఇప్పుడు తాజాగా గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయింది. పొత్తులో భాగంగా బీజేపీకి 67 స్థానాలు అప్పగించిన టీడీపీ కొన్ని […]

టీడీపీకి వెన్నుపోటు కొత్తకాదు
X

టీడీపీ, బీజేపీ మధ్య బంధం చాలా ధృడమైనది. వీరి బంధమంత ధృడమైన సిమెంట్ కూడా ఇంకా రాలేదు. దశాబ్ధాల రాజకీయంలో బీజేపీ భుజం మీద కాలు పెట్టి టీడీపీ గోడ దాటిన ఉదంతాలే కనిపిస్తాయి. టీడీపీ గోడ ఎక్కిన తర్యాత బీజేపీ కూడా అదే గోడ దూకాలని చూస్తుంది. కానీ టీడీపీ నుంచి పోటే మిగులుతుంది. ఇప్పుడు తాజాగా గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయింది. పొత్తులో భాగంగా బీజేపీకి 67 స్థానాలు అప్పగించిన టీడీపీ కొన్ని చోట్ల తన అభ్యర్థులను నిలిపింది. కొన్ని చోట్ల నేరుగా బీపాం ఇచ్చారు. మరికొన్ని చోట్ల రెబల్‌ రూపంలో అభ్యర్థులను దింపారు. జూబ్లిహిల్స్ డివిజన్‌ పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. అయితే చివరకు ఆకుల వెంకటేశ్వరరావుకు బీపాం ఇచ్చింది టీడీపీ. చివరి నిమిషంలో బీపాం ఇచ్చి కమలం పార్టీకి టీడీపీ షాక్ ఇచ్చింది.

కీలకమైన జూబ్లిహిల్స్‌లోనే ఇలా జరగడంతో బీజేపీ నేతలు కంగుతిన్నారు. మాదాపూర్ డివిజన్‌ కూడా బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ టీడీపీ బీ పాం మీద ఎర్రగుంట శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. ఇంకా పలు డివిజన్లలో టీడీపీ రెబల్స్ బరిలో ఉన్నారు. పేరుకు వారు రెబల్స్ అయినా టీడీపీ అండ వారికుందని చెప్పుకుంటున్నారు. జూబ్లిహిల్స్ స్థానంలో టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టినా బీజేపీ అగ్రనేతలు అడ్డుచెప్పకపోవడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా తెలిసిన వారు మాత్రం టీడీపీ నుంచి ఇలాంటి పోట్లు మనకేం కొత్తనా అని ప్రశ్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌కు కేటాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులకు బీపాం ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

First Published:  22 Jan 2016 6:35 AM IST
Next Story