Telugu Global
Others

ఈ బురద అందరూ రాసుకోవాలి

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఒకప్పుడు నటిగా మంచి పేరు తెచ్చుకుని రాజకీయాల్లోనూ రాణిస్తున్న నాయకురాలు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సమయంలోనూ ఆమె తనలోని ప్రతిభను మరోసారి చాటుకున్నారు. తోటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై ముప్పేట దాడి జరుగుతుండడంతో ఆయనను కాపాడేందుకు స్మృతి ఇరానీ పాత అంశాన్ని తెరపైకి తెచ్చారు. దత్తన్నపై ఒత్తిడి తగ్గించేందుకు కాంగ్రెస్ ఎంపీ హనుమన్నను లాగేశారు స్మృతి. యూనివర్శిటీలో పరిణామాలపై దత్తాత్రేయే కాదు హనుమంతరావు కూడా లేఖ రాశారని […]

ఈ బురద అందరూ రాసుకోవాలి
X

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఒకప్పుడు నటిగా మంచి పేరు తెచ్చుకుని రాజకీయాల్లోనూ రాణిస్తున్న నాయకురాలు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సమయంలోనూ ఆమె తనలోని ప్రతిభను మరోసారి చాటుకున్నారు. తోటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై ముప్పేట దాడి జరుగుతుండడంతో ఆయనను కాపాడేందుకు స్మృతి ఇరానీ పాత అంశాన్ని తెరపైకి తెచ్చారు. దత్తన్నపై ఒత్తిడి తగ్గించేందుకు కాంగ్రెస్ ఎంపీ హనుమన్నను లాగేశారు స్మృతి. యూనివర్శిటీలో పరిణామాలపై దత్తాత్రేయే కాదు హనుమంతరావు కూడా లేఖ రాశారని వెల్లడించారు. అలాంటప్పుడు దత్తాత్రేయను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు ప్రశ్నించారామె. మంత్రిగారు అంత ధీమాగా చెప్పడంతో జనం కూడా ఇది నిజమేకావచ్చు అని నమ్మారు. కానీ అసలు నిజం వేరు.

హనుమంతరావు లేఖ రాసిన మాట నిజమే. కానీ రోహిత్ మృతికి ముందు కాదు. 2014 నవంబర్‌లో వీహెచ్ కేంద్రమంత్రికి లేఖ రాశారు. అది కూడా యూనివర్శిటీలో వీసీతో పాటు పలువురు చేస్తున్న అవినీతిపై. యూనివర్శిటీలో అవినీతి మితిమీరిపోయిందని చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వీహెచ్‌ కోరారు. యూనివర్శిటీ విలువలు పడిపోతున్నాయని ఆ లేఖలో వీహెచ్ వాపోయారు. కానీ ఇప్పటి వరకు వీహెచ్‌ లేఖపై స్మృతి శాఖ నుంచి కనీస స్పందన లేదు. ఇప్పుడు మాత్రం రోహిత్‌ ఆత్మహత్యకు దత్తత్రేయ లేఖే కారణమని ఆరోపణలు రావడంతో తెలివిగా స్మృతి ఇరానీ వీహెచ్‌ పాత లేఖను ప్రస్తావించారు. అంటే హెచ్‌సీయూలో జరిగిన పాపంలో కాంగ్రెస్‌కు వాటా ఉంది అని చాటింపు వేసేందుకు స్మృతి ఇరానీ తెలివిగా ఈ ఎత్తువేశారు. ఆ ఎత్తులో కాసేపు ఆమె పై చేయి కూడా సాధించారు. వీహెచ్‌ లేఖ ఎప్పుడు రాశారు…. అందులో ఏముందని జనం తెలుసుకునేందుకు పట్టిన సమయంలోనే స్మృతి మాటలు కాసింత దూరం ప్రయాణించాయి. కానీ వీహెచ్ వచ్చి అసలు విషయం చెప్పే సరికి స్మృతి ఇరానీ అసలు రూపం అర్థమైపోయింది జనానికి.

First Published:  22 Jan 2016 11:21 AM IST
Next Story