టీడీపీకి ఎదురుదెబ్బ- మాజీ మంత్రి రాజీనామా
టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో తనకు జరిగిన అవమానంతో మాజీ మంత్రి పార్టీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు కేటాయించలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టు కృష్ణయాదవ్ చెప్పారు. కృష్ణయాదవ్ కొద్దికాలం నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రేటర్ టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించి మాగంటి గోపినాథ్‌ను నియమించడంతో కృష్ణయాదవ్ చిన్నబుచ్చుకున్నారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ టికెట్ల కేటాయింపులోనూ మాగంటి […]
టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో తనకు జరిగిన అవమానంతో మాజీ మంత్రి పార్టీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్లు కేటాయించలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టు కృష్ణయాదవ్ చెప్పారు. కృష్ణయాదవ్ కొద్దికాలం నుంచే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రేటర్ టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించి మాగంటి గోపినాథ్‌ను నియమించడంతో కృష్ణయాదవ్ చిన్నబుచ్చుకున్నారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ టికెట్ల కేటాయింపులోనూ మాగంటి గోపినాథ్ వర్గం … కృష్ణయాదవ్ వర్గానికి కావాలనే మొండి చేయి చూపిందని చెబుతున్నారు. అందుకే కృష్ణయాదవ్ పార్టీ వీడారని చెబుతున్నారు. కృష్ణయాదవ్ గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేశారు. అయితే నకిలీస్టాంపుల కుంభకోణంలో రాజీనామా చేసి జైలుకెళ్లారు. జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు తిరిగి టీడీపీలో చేర్చుకున్నారు.
Click on Image to Read: