Telugu Global
Others

తెరపైకి వెంకయ్య పేరు

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకు సంబంధించి విద్యార్థులు, వర్శిటీ సిబ్బంది కొత్తకొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా అప్పారావు వెనుక ఉన్న రాజకీయనాయకులపై గురి పెట్టారు. ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపైనా ఆరోపణలు వస్తున్నాయి. వెంకయ్య అండదండలు చూసుకునే వీసీ అప్పారావు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్య, అప్పారావు మధ్య ఉన్న సంబంధాలకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అప్పారావుకు వీసీ పదవి ఇవ్వాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి […]

తెరపైకి వెంకయ్య పేరు
X

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకు సంబంధించి విద్యార్థులు, వర్శిటీ సిబ్బంది కొత్తకొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా అప్పారావు వెనుక ఉన్న రాజకీయనాయకులపై గురి పెట్టారు. ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపైనా ఆరోపణలు వస్తున్నాయి. వెంకయ్య అండదండలు చూసుకునే వీసీ అప్పారావు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్య, అప్పారావు మధ్య ఉన్న సంబంధాలకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అప్పారావుకు వీసీ పదవి ఇవ్వాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి వెంకయ్యే స్వయంగా సిఫార్సు చేశారని వర్శిటీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సామాజికవర్గపరంగానూ వారి మధ్య బంధం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. వీసీ పదవి కోసం దాదాపు 35 మంది పోటీ పడినా చివరకు అప్పారావు లాబీయింగే నెగ్గిందని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే…

2001- 2004 మధ్య కాలంలో చంద్రబాబు హయాంలోనే అప్పారావు హెచ్‌సీయూ హాస్టల్‌కు చీఫ్ వార్డెన్ పోస్టు దక్కించుకున్నారు. చంద్రబాబు, వెంకయ్య అండ వల్లే అప్పారావుకు ఎదురులేకుండాపోయిందని సిబ్బంది చెబుతున్నారు. అయితే అప్పారావు మాత్రం తనకు రాజకీయనాయకులతో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నారు.

First Published:  21 Jan 2016 4:26 AM GMT
Next Story