వార్ ఫీల్డ్‌కు జగన్... రెండు గ్రామాలే టార్గెట్
వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాద్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. పొలిటికల్ వార్ ఫీల్డ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లో ఉండి ఏపీ రాజకీయాలను పర్యవేక్షించడం కంటే నేరుగా అక్కడే నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్న జగన్ అందుకు తగ్గట్టు ముందుకెళ్తున్నారు. మార్చి ఆఖరి నాటికి ఆయన కొత్త రాజధాని ప్రాంతానికి తరలివెళ్లనున్నారు. తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల పరిధిలో ఆయన తన నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో వైసీపీకి గట్టిపట్టు ఉంది. ఈ రెండు […]
వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాద్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. పొలిటికల్ వార్ ఫీల్డ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లో ఉండి ఏపీ రాజకీయాలను పర్యవేక్షించడం కంటే నేరుగా అక్కడే నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్న జగన్ అందుకు తగ్గట్టు ముందుకెళ్తున్నారు. మార్చి ఆఖరి నాటికి ఆయన కొత్త రాజధాని ప్రాంతానికి తరలివెళ్లనున్నారు. తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల పరిధిలో ఆయన తన నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో వైసీపీకి గట్టిపట్టు ఉంది. ఈ రెండు గ్రామాల్లో జగన్ సొంతసామాజికవర్గం బలంగా ఉంది. దీంతో జగన్ నివాసానికి ఈరెండు గ్రామాలు సరైనవని పార్టీ నేతలు సూచించారు.
కొద్ది నెలల క్రితం విజయవాడలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల మనసు మార్చుకున్నారు. ఇప్పటికే కృష్ణ నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన లింగమనేని భవనాన్ని స్వాధీనం చేసుకున్న చంద్రబాబు అక్కడే నివాసం ఉంటున్నారు. జగన్ నివాసంతో పాటు వైసీపీ పార్టీ వ్యవహారాలు నడిపేందుకు కూడా అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి ఆఖరికి ఏపీలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని జగన్ తన అనుచరులకు ఆదేశించారు. జగన్ కొత్త రాజధానికి తరలివెళ్తున్న విషయాన్ని పార్టీ నాయకుడు తలశిల రఘురామ్ కూడా ధృవీకరించారు.