Telugu Global
Others

లేఖ దత్తన్నే కాదు... హనుమన్నా పంపారట!

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు.కొందరు సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూనివర్శిటీలోని పరిణామాలపై దత్తాత్రేయే కాకుండా కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు కూడా లేఖ రాశారని ఆమె అన్నారు. వివాదం దళితులు, దళితేతరుల మధ్య కాదన్నారు. ఆగస్ట్ 4న సుశీల్‌కుమార్‌పై దాడి జరిగిందని దానిపై అతడి తల్లి కోర్టును ఆశ్రయించారని స్మృతి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు యూనివర్శిటీ విచారణ కమిటీ […]

లేఖ దత్తన్నే కాదు... హనుమన్నా పంపారట!
X

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు.కొందరు సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. యూనివర్శిటీలోని పరిణామాలపై దత్తాత్రేయే కాకుండా కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు కూడా లేఖ రాశారని ఆమె అన్నారు. వివాదం దళితులు, దళితేతరుల మధ్య కాదన్నారు. ఆగస్ట్ 4న సుశీల్‌కుమార్‌పై దాడి జరిగిందని దానిపై అతడి తల్లి కోర్టును ఆశ్రయించారని స్మృతి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు యూనివర్శిటీ విచారణ కమిటీ వేసిందన్నారు. విద్యార్థులకు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు కోర్టు కూడా నిరాకరించిందని గుర్తు చేశారు కేంద్రమంత్రి. ప్రతి అంశానికి కులాన్ని ఆపాదించడం సరికాదన్నారు. దత్తాత్రేయ కూడా బలహీన వర్గాలకు చెందిన వారేనని స్మృతి అన్నారు. అసలు రోహిత్‌ తన ఆత్మహత్యకు ఫలానవారు కారణమని సూసైడ్‌ నోట్‌లో ఎక్కడా చెప్పలేదన్నారామె.

First Published:  20 Jan 2016 11:12 AM IST
Next Story