Telugu Global
Cinema & Entertainment

ఊపిరి విడుదల తేదీ ఫిక్స్

సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తో పండగ చేసుకుంటున్న నాగార్జున…. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమౌతున్నాడు. కార్తితో కలిసి నాగార్జున చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 25న ఊపిరి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే…. వేసవి సినిమాల్లో విడుదలవుతున్న […]

ఊపిరి విడుదల తేదీ ఫిక్స్
X
సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తో పండగ చేసుకుంటున్న నాగార్జున…. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమౌతున్నాడు. కార్తితో కలిసి నాగార్జున చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 25న ఊపిరి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే…. వేసవి సినిమాల్లో విడుదలవుతున్న మొట్టమొదటి చిత్రం ఊపిరి. సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా…. అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ లో హిట్టయిన ది ఇన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా ఊపిరిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. మాస్ ఎలిమెంట్స్ కు దూరంగా కథను నమ్ముకొని చేస్తున్న ఈ సినిమాతో నాగార్జున ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
First Published:  20 Jan 2016 12:34 AM IST
Next Story