Telugu Global
Cinema & Entertainment

అఖిల్ రేసులోకి కొత్త దర్శకుడు

రెండో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు అఖిల్. ఈ విషయంలో అఖిల కంటే, నాగార్జునే ఎక్కువ పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఎంట్రీ మూవీతో చేసిన మిస్టేక్స్ ను రెండో సినిమాలో రిపీట్ కాకుండా చూడాలనుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లను పరిశీలిస్తున్న నాగార్జున… తాజాగా మరో కొత్త దర్శకుడ్ని కూడా ఈ జాబితాలో చేర్చాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో తనకు బ్రహ్మాండమైన హిట్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణను అఖిల్ సినిమా కోసం సిద్ధం చేయాలని భావిస్తున్నాడట నాగ్. […]

అఖిల్ రేసులోకి కొత్త దర్శకుడు
X
రెండో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు అఖిల్. ఈ విషయంలో అఖిల కంటే, నాగార్జునే ఎక్కువ పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఎంట్రీ మూవీతో చేసిన మిస్టేక్స్ ను రెండో సినిమాలో రిపీట్ కాకుండా చూడాలనుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లను పరిశీలిస్తున్న నాగార్జున… తాజాగా మరో కొత్త దర్శకుడ్ని కూడా ఈ జాబితాలో చేర్చాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో తనకు బ్రహ్మాండమైన హిట్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణను అఖిల్ సినిమా కోసం సిద్ధం చేయాలని భావిస్తున్నాడట నాగ్.
కల్యాణ్ కృష్ణ తన రెండో సినిమాను కూడా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ దర్శకుడితో పాటు నాగార్జున కూడా కన్ ఫర్మ్ చేశాడు. ఓ మంచి కథ ఉంటే సిద్ధం చేయమని ఇప్పటికే కల్యాణ్ కృష్ణను పురమాయించిన నాగార్జున… ఆ కథను అఖిల్ ను దృష్టిలో పెట్టుకొని రాయాల్సిందిగా తాజాగా ఆదేశాలు జారీచేశాడట. మరి అఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేసే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి.
First Published:  20 Jan 2016 12:32 AM IST
Next Story