Telugu Global
Others

దత్తాత్రేయ పదవి పోవడం ఖాయమా?

బండారు దత్తాత్రేయ అనగానే చాలా సౌమ్యుడు అన్న భావన అందరిలో ఉంది. ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టరు. ఆయన్ని కూడా పెద్దగా ఎవరూ విమర్శించరు. కానీ ఆయనకు ఎప్పటి నుంచో లేఖలు రాసే అలవాటు ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దత్తాత్రేయ ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సుమారు 100 వరకు ఉత్తరాలు రాశారు. ఆ తర్వాత కాలంలోనూ అదే ఒరవడి కొనసాగించారు దత్తాత్రేయ. ఇప్పుడు కేంద్రమంత్రి అయినా ఉత్తరాలు రాసే అలవాటు ఆయన మానుకోలేదు. ఇప్పుడు […]

దత్తాత్రేయ పదవి పోవడం ఖాయమా?
X
బండారు దత్తాత్రేయ అనగానే చాలా సౌమ్యుడు అన్న భావన అందరిలో ఉంది. ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టరు. ఆయన్ని కూడా పెద్దగా ఎవరూ విమర్శించరు. కానీ ఆయనకు ఎప్పటి నుంచో లేఖలు రాసే అలవాటు ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దత్తాత్రేయ ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సుమారు 100 వరకు ఉత్తరాలు రాశారు. ఆ తర్వాత కాలంలోనూ అదే ఒరవడి కొనసాగించారు దత్తాత్రేయ. ఇప్పుడు కేంద్రమంత్రి అయినా ఉత్తరాలు రాసే అలవాటు ఆయన మానుకోలేదు. ఇప్పుడు ఆ అలవాటే ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా ఉంది. హెచ్ సీయూలోని అంబేద్కర్ విద్యార్థి సంఘానికి చెందిన రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ లేఖే కారణమంటూ విద్యార్థులు ఆయన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఇటీవల కాలంలో దత్తాత్రేయ తీరుపై బీజేపీలోని నాయకులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారన్న భావన కమలనాథుల్లో ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా కొందరు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పైగా కేసీఆర్, కవిత, కేటీఆర్ అంటే దత్తాత్రేయ వల్లమాలిన అభిమానం చూపిస్తున్నారని బీజేపీ నాయకులే అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ వేదికపై ఉండగానే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించినా ఆయన సైలెంట్ గా ఉండడం కూడా కమలనాథుల ఆగ్రహానికి కారణమవుతోంది.
సరిగ్గా ఇప్పుడు రోహిత్‌ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హెచ్ సీయూ వీసీ అప్పారావే బాధ్యత వహించాలని, కేంద్ర ప్రభుత్వం వాళ్లను పదవుల నుంచి తప్పించాలన్న డిమాండ్‌ తీవ్రమవుతోంది. త్వరలోనే కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న ఒకే ఒక మంత్రి దత్తాత్రేయను తొలగించడం కష్టమన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అయితే బీజేపీ నేతల నుంచి దత్తాత్రేయ తీరుపై అసంతృప్తి ఉండడంతో అధిష్టానం ఏం చేస్తుందన్నది చర్చనీయాంశమైంది.
First Published:  20 Jan 2016 6:05 AM IST
Next Story