Telugu Global
Others

కావూరి గండం గట్టెక్కేదెలా?

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఆర్ధిక కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఆస్తుల వేలానికి పోటీ జరుగుతోంది. తమకు చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదంటూ తెలంగాణ వాణిజ్య శాఖ కావూరి కంపెనీకి నోటీసులు  జారీ చేసింది. పన్ను బకాయి వసూలు కోసం కంపెనీ ఆస్తులు వేలం వేస్తామని నోటీసులిచ్చింది. దీనిపై ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీని హైకోర్టుకు వెళ్లింది. అయినా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. ఆస్తుల వేలంపై స్టే ఇచ్చేందుకు […]

కావూరి గండం గట్టెక్కేదెలా?
X

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఆర్ధిక కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఆస్తుల వేలానికి పోటీ జరుగుతోంది. తమకు చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదంటూ తెలంగాణ వాణిజ్య శాఖ కావూరి కంపెనీకి నోటీసులు జారీ చేసింది. పన్ను బకాయి వసూలు కోసం కంపెనీ ఆస్తులు వేలం వేస్తామని నోటీసులిచ్చింది. దీనిపై ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీని హైకోర్టుకు వెళ్లింది. అయినా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. ఆస్తుల వేలంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఫిబ్రవరి 10లోగా మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని సూచించింది. కావూరి కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో ఉన్నాయని సమాచారం.

ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఆస్తులన్నీ ఇప్పటికే బ్యాంకుల్లో తనఖా పెట్టారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందని కావూరి కంపెనీ ప్రశ్నించినా ఆ వాదన నిలబడలేదు. తెలంగాణ ప్రభుత్వం నుంచే కాదు. బ్యాంకుల నుంచి కూడా కావూరి ఆస్తులు వేలం ముప్పును ఎదుర్కొంటున్నాయి. వివిధ బ్యాంకుల నుంచి కావూరి కంపెనీ వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. ఇలా 18 బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. కానీ వాటికి తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమవుతోంది. కొద్ది వారాల క్రితం 18 బ్యాంకుల ఉద్యోగులు హైదరాబాద్‌లోని కావూరికి చెందిన ప్రొగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించి పరువు బజారుకీడ్చారు. అప్పు చెల్లించి బ్యాంకులను కాపాడాలంటూ ఉద్యోగులు మౌన ప్రదర్శన చేశారు. ఈ అప్పుల ముప్పును ముందే గమనించే కావూరి కాంగ్రెస్‌ నుంచి అధికార బీజేపీలోకి వచ్చారని చెబుతుంటారు. అయినా ఆయన అప్పుల గండం నుంచి గట్టెక్కలేకపోతున్నారు.

First Published:  18 Jan 2016 11:04 PM GMT
Next Story