Telugu Global
Cinema & Entertainment

ఇక అస‌లు విష‌యం ఎంతో తెలిసి పోద్ది !

పండ‌గ అంటే సినిమా చూసే జ‌నాలు ఎక్కువుగా వుంటారు.  స్టార్ హీరోల చిత్రాల‌కు ఓపెనింగ్స్  భారీగా ఉంటాయి.   సంక్రాంతి పండ‌గ మూడు రోజులు స్టార్ హీరోల చిత్రాలు  హౌస్ ఫుల్ బోర్డుల‌తో న‌డిచాయి.  అయితే ప్ర‌స్తుతం పండ‌గ  హ‌డావుడి త‌గ్గింది.  ఈ పండ‌గ‌కు నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్ర‌స్తుతానికి క‌మ‌ర్షియ‌ల్  రేసులో    ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం  ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా.. నాగార్జున  సొగ్గాడే చిన్నినాయ‌న చిత్రం  సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక బాల‌య్య డిక్టేర్ […]

ఇక అస‌లు విష‌యం ఎంతో తెలిసి పోద్ది !
X

పండ‌గ అంటే సినిమా చూసే జ‌నాలు ఎక్కువుగా వుంటారు. స్టార్ హీరోల చిత్రాల‌కు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. సంక్రాంతి పండ‌గ మూడు రోజులు స్టార్ హీరోల చిత్రాలు హౌస్ ఫుల్ బోర్డుల‌తో న‌డిచాయి. అయితే ప్ర‌స్తుతం పండ‌గ హ‌డావుడి త‌గ్గింది. ఈ పండ‌గ‌కు నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ప్ర‌స్తుతానికి క‌మ‌ర్షియ‌ల్ రేసులో ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా.. నాగార్జున సొగ్గాడే చిన్నినాయ‌న చిత్రం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక బాల‌య్య డిక్టేర్ చిత్రం మూడో ప్లేస్ కు ప‌రిమితం అవ్వ‌గా.. లాస్ట్ బ‌ట్ నాట్ లీస్ట్ అన్న‌ట్లుగా శ‌ర్వానంద్ న‌టించిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం సేఫ్ జోన్‌ల్ ఉంది.

మ‌రి ఈ రోజు నుంచి ఒక వారం పాటు ఏ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ నిల‌క‌డ‌గా ఉంటాయో..ఆ చిత్ర‌మే ఈ యేడాది సంక్రాంతి హిట్ ఫిల్మ్ అనిపించుకునే చాన్స్ ఎక్కువుగా ఉంటుంది. నాన్నాకు ప్రేమ‌తో చిత్రం 50 కోట్ల క్ల‌బ్ లో చేరాలంటే ఈ రోజు నుంచి సండే వర‌కు క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా ఉండాల్సిందే. నాగ్ చిత్రం అత‌ని కెరీర్‌లో ఒక బెస్ట్ బాక్సాఫీస్ హిట్ అనిపించుకోవాల‌న్నా గానీ.. ఈ వారం ముఖ్యం. బాల‌య్య సినిమాకు మాస్ ఆడియ‌న్స్ మాత్ర‌మే ర‌క్ష, శ‌ర్వానంద్ నిర్మాత‌ను, బ‌య్య‌ర్ల‌ను అల్రెడీ సేఫ్ జోన్‌లో ప‌డేశాడు. మిగిలిన పోటి ఎన్టీఆర్ వ‌ర్సెస్ నాగార్జ‌నే మ‌రి. ఎవ‌రి సినిమా విష‌యం ఎంత అనేది ప‌రీక్ష ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన‌ట్లే.

First Published:  19 Jan 2016 12:34 AM IST
Next Story