Telugu Global
Others

భగ్గుమంటున్న పచ్చగడ్డి " రాజీనామాకు రెడీ అట!

అనంత టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి వెలుగుచూశాయి. ఈసారి అనంతపురం టౌన్‌లోని తిలక్ రోడ్డు, గాంధీ బజార్ సెంటర్‌లో తేల్చుకునేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఒక వర్గం జేసీ దివాకర్ రెడ్డి కాగా… మరో వర్గం స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి. పంతం నెగ్గకుంటే రాజీనామా చేసేందుకైనా రెడీ అనే స్థాయికి పరిస్థితి చేరింది. మ్యాటరేంటంటే అనంతపురం నగరంలోకి వాహనాలు తిలక్ రోడ్డు ద్వారానే ఎంటర్ అవ్వాలి. కానీ ఆ రోడ్డు నగరంలోనే అత్యంత ఇరుకైనదిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యమైన […]

భగ్గుమంటున్న పచ్చగడ్డి  రాజీనామాకు రెడీ అట!
X

అనంత టీడీపీలో వర్గవిభేదాలు మరోసారి వెలుగుచూశాయి. ఈసారి అనంతపురం టౌన్‌లోని తిలక్ రోడ్డు, గాంధీ బజార్ సెంటర్‌లో తేల్చుకునేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఒక వర్గం జేసీ దివాకర్ రెడ్డి కాగా… మరో వర్గం స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి. పంతం నెగ్గకుంటే రాజీనామా చేసేందుకైనా రెడీ అనే స్థాయికి పరిస్థితి చేరింది. మ్యాటరేంటంటే అనంతపురం నగరంలోకి వాహనాలు తిలక్ రోడ్డు ద్వారానే ఎంటర్ అవ్వాలి. కానీ ఆ రోడ్డు నగరంలోనే అత్యంత ఇరుకైనదిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యమైన రోడ్డు ఇంత ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తిలక్ రోడ్డు, గాంధీ బజార్ రోడ్డును విస్తరించాలని భావించారు. రోడ్ల పరిస్థితిని చంద్రబాబుకు వివరించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. అంతే కాదు 80 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించారు. ఇక్కడే స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎంటరయ్యారు.

రోడ్లను ఎట్టి పరిస్థితిలో విస్తరించడానికి వీల్లేదంటున్నారు. ఇరుకైన రోడ్లను వెడల్పు చేస్తామంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే తన లెక్కలు తనకున్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే తిలక్ రోడ్డు, గాంధీ బజార్‌ రోడ్లను వెడల్పు చేయబోమని… మీ మీ నిర్మాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రభాకర్ చౌదరి స్థానికులకు మాట ఇచ్చారట. అందుకే తనకు ఆ ప్రాంతం వారు ఓట్లేసి గెలిపించారని… కాబట్టి మాట నిలబెట్టుకోవడంలో భాగంగా రోడ్ల విస్తరణకు తాను ఒప్పుకోనంటున్నారు. అవసరమైతే రాజీనామా చేసేందుకైనా సిద్ధమే గానీ రోడ్ల విస్తరణకు తాను అంగీకరించబోనని ఆయన చెబుతున్నారు.

జేసీ మాత్రం తాడిపత్రిని ఉదాహరణగా చూపుతున్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే రోడ్ల విస్తరణ ఎంతో అవసరమంటున్నారు. తాడిపత్రిలో రోడ్లను వెడల్పు చేయడం వల్లే స్టేట్‌లోనే నెంబర్‌ వన్ మున్సిపాలిటీగా పేరుతెచ్చుకుందని చెబుతున్నారు. జేసీ బ్రదర్స్‌కు ప్రభాకర్ చౌదరికి మధ్య వివాదం ఈ ఒక్క విషయంలోనే కాదు. గతంలో అనంతపురం పట్టణంలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ విషయంలోనూ తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చూడాలి రోడ్ల విస్తరణలో దివాకర్ రెడ్డి మాట నెగ్గుతుందో లేక ప్రభాకర్ చౌదరి పంతం నెగ్గుతుందో?

Click on Image to Read:

lokesh

jagan-jail

HYD-Central-University

kavuri-sambasivarao

ntr

First Published:  19 Jan 2016 10:55 AM IST
Next Story