Telugu Global
Others

గ్రేటర్‌లో కేసీఆర్ ప్రచారం ఇలా!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార జోరు ఉధృతమైంది. అన్నిపార్టీలు కదనరంగంలోకి దూకాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుండగా.. దాన్ని మరింత తీవ్రం చేయాలని కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం స్వయంగా సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. అయితే కేసీఆర్ బహిరంగ సభల్లో కాకుండా.. ఆన్ లైన్ ద్వారా గానీ, టీవీ మాధ్యమాల ద్వారాగానీ వినూత్నంగా ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఈనెల 24 నుంచి 30 వరకు సీఎం […]

గ్రేటర్‌లో కేసీఆర్ ప్రచారం ఇలా!
X

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార జోరు ఉధృతమైంది. అన్నిపార్టీలు కదనరంగంలోకి దూకాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుండగా.. దాన్ని మరింత తీవ్రం చేయాలని కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం స్వయంగా సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. అయితే కేసీఆర్ బహిరంగ సభల్లో కాకుండా.. ఆన్ లైన్ ద్వారా గానీ, టీవీ మాధ్యమాల ద్వారాగానీ వినూత్నంగా ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఈనెల 24 నుంచి 30 వరకు సీఎం కేసీఆర్ గ్రేటర్ లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమం తరహాలోనే కేసీఆర్ తోనూ నాలుగైదు చోట్ల ప్రచారం చేయించేందుకు గులాబీ నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. కేసీఆర్ ప్రజలతో మాట్లాడే కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలోని ప్రధాన సెంటర్లలో భారీ స్క్రీన్ లు ఏర్పాటు చేసి దాన్నే ప్రచారంగా ఉపయోగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఈనెల 28న తన సొంత ఛానల్ టీ న్యూస్ లోనూ కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. ఈనెల 31న ప్రచారం ముగుస్తుంది. కాబట్టి ఈలోపు అంటే 29లేదా 30న నిజాంకాలేజీలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద గ్రేటర్ లో జోరు మీదున్న గులాబీ నాయకులు ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి వార్ వన్ సైడ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

First Published:  19 Jan 2016 5:48 AM IST
Next Story