Telugu Global
Cinema & Entertainment

అసిన్ పెళ్లి... సంబరం మాత్రం అప్పుడే..

సౌత్ ను ఓ ఊపుఊపి, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన అందాలతార అసిన్… రేపు వివాహం చేసుకోనుంది. మైక్రోమాక్స్ సిఈవో రాహుల్ శర్మతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నఈ మలయాళ బ్యూటీ… ఎట్టకేలకు అతడ్ని దిల్లీలో వివాహం చేసుకోనుంది. రేపు (జనవరి 20) దిల్లీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ….. అసిన్-శర్మ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన సంబరాలు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. గతంలోనే ప్రకటించినట్టు ఈ వివాహం రెండు రకాలుగా జరగనుంది. […]

అసిన్ పెళ్లి... సంబరం మాత్రం అప్పుడే..
X
సౌత్ ను ఓ ఊపుఊపి, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన అందాలతార అసిన్… రేపు వివాహం చేసుకోనుంది. మైక్రోమాక్స్ సిఈవో రాహుల్ శర్మతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నఈ మలయాళ బ్యూటీ… ఎట్టకేలకు అతడ్ని దిల్లీలో వివాహం చేసుకోనుంది. రేపు (జనవరి 20) దిల్లీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ….. అసిన్-శర్మ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన సంబరాలు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. గతంలోనే ప్రకటించినట్టు ఈ వివాహం రెండు రకాలుగా జరగనుంది. మొదట శర్మ భావిస్తున్నట్టు ఉత్తరాది వివాహ శైలిలో పెళ్లి ఉంటుంది. ఆ తర్వాత మలయాళీ సంప్రదాయంలో వివాహం జరుగుతుంది. పెళ్లికి ఇప్పటికే అందరికీ ఆహ్వనాలు అందినప్పటికీ…దిల్లీకి వచ్చే ఆహుతుల సంఖ్య తక్కువే. ఎందుకంటే… ముంబయిలో జనవరి 23న పెద్ద రిసెప్షన్ ఏర్పాటుచేసింది అసిన్. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులంతా విచ్చేసే అవకాశముంది. అసిన్ ధరించిన 6 కోట్ల రూపాయల పెళ్లి ఉంగరం…. మొత్తం కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
First Published:  19 Jan 2016 12:36 AM IST
Next Story