Telugu Global
Others

బాబు భవిష్యవాణి " నిజమవడం సాధ్యమా?

ఏపీలో ప్రతిపక్షాన్ని బలహీనపరచడంలో భాగంగా ఇతర పార్టీల నేతలకు టీడీపీ రెడ్ కార్పెట్ పరుస్తోంది. కొత్తవాళ్లు వస్తే తమ స్థానాలకు ఎక్కడ ఎసరొస్తుందోనని భయపడుతున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు చెబుతున్నది ఒకే మాట. 2019నాటికి ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెరుగుతాయని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కొత్త స్థానాల్లో పోటీకి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. పాత వారికి వచ్చిన ఇబ్బందేమీ లేదని హామీ ఇస్తున్నారు. ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిన సందర్భంగానూ ఆదివారం […]

బాబు భవిష్యవాణి  నిజమవడం సాధ్యమా?
X

ఏపీలో ప్రతిపక్షాన్ని బలహీనపరచడంలో భాగంగా ఇతర పార్టీల నేతలకు టీడీపీ రెడ్ కార్పెట్ పరుస్తోంది. కొత్తవాళ్లు వస్తే తమ స్థానాలకు ఎక్కడ ఎసరొస్తుందోనని భయపడుతున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు చెబుతున్నది ఒకే మాట. 2019నాటికి ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెరుగుతాయని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కొత్త స్థానాల్లో పోటీకి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. పాత వారికి వచ్చిన ఇబ్బందేమీ లేదని హామీ ఇస్తున్నారు. ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిన సందర్భంగానూ ఆదివారం చంద్రబాబు స్వయంగా ఈ విషయం చెప్పారు. 2019నాటికి అసెంబ్లీ స్థానాలు 225కు పెరుగుతాయని కొత్తవారికి ఆ స్థానాల్లో అవకాశం ఇస్తామన్నారు. అయితే చంద్రబాబు చెప్పింది ఎంతవరకు నిజమవుతుందన్న దానిపై టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

వారి అనుమానానికి బేస్ కూడా ఉంది. ఎందుకంటే 2015 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ సుమన్‌… తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యపై అడిగిన ప్రశ్నకు కేంద్రం పార్లమెంట్‌ వేదికగా సమాధానం చెప్పింది. 2026 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు వీలు కాదని తేల్చిచెప్పింది. దీంతో కొత్త సీట్లను నమ్ముకున్న వారంతా ఖంగుతిన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీట్లు పెరుగుతాయని చెప్పడంతో నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉన్నది మిత్రపక్షమే కాబట్టి చంద్రబాబు అక్కడ చక్రం తిప్పి సీట్లు సంఖ్య పెరిగేలా చేస్తారేమో చూడాలి. అలా జరగకుంటే 2019 ఎన్నికల్లో పాతవారికి, కొత్తవారికి మధ్య సీట్ ఫైట్‌కు అవకాశం ఉంటుంది.

First Published:  18 Jan 2016 1:07 AM GMT
Next Story