సోమిరెడ్డికి మోకరిల్లిన ఆనం " తొలి రోజే వాగ్వాదం
ఆనం రామనారాయణరెడ్డి పరిచయం అక్కర్లేని నేత. కాలం కలిసొస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి తర్వాత సీఎం కావాల్సిన వ్యక్తి. అలాంటి నేత ఇప్పుడు మరొకరి కింద పనిచేయడానికి సిద్ధమని ప్రకటించుకున్నారు. అది కూడా నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్నసోమిరెడ్డి కింద పనిచేయడానికి సిద్ధమని బహిరంగసభలో చెప్పి రాజకీయం ఎలా ఉంటుందో మరోసారి చూపించారు. టీడీపీలో చేరిక సందర్భంగా విజయవాడలో ఆనం బ్రదర్స్ ఏర్పాటు చేసిన సభ ఇందుకు వేదికైంది. ఇదే సభలో ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి మధ్య […]
ఆనం రామనారాయణరెడ్డి పరిచయం అక్కర్లేని నేత. కాలం కలిసొస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి తర్వాత సీఎం కావాల్సిన వ్యక్తి. అలాంటి నేత ఇప్పుడు మరొకరి కింద పనిచేయడానికి సిద్ధమని ప్రకటించుకున్నారు. అది కూడా నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్నసోమిరెడ్డి కింద పనిచేయడానికి సిద్ధమని బహిరంగసభలో చెప్పి రాజకీయం ఎలా ఉంటుందో మరోసారి చూపించారు. టీడీపీలో చేరిక సందర్భంగా విజయవాడలో ఆనం బ్రదర్స్ ఏర్పాటు చేసిన సభ ఇందుకు వేదికైంది. ఇదే సభలో ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి మధ్య ఒక విధమైన వాగ్వాదం జరిగింది. రాజకీయాల్లో కక్షలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. రాబోయే తరాల కోసమే తాము టీడీపీలో చేరామన్న ఆనం సోదరుడు రాజకీయాల్లో కక్షలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అంతటితో ఆగలేదు.
తాము టీడీపీ సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేసే వ్యక్తులం కాదని సోమిరెడ్డికి ఎలాంటి భయం, అనుమానం అవసరం లేదన్నారు రామనారాయణరెడ్డి. సోమిరెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమన్నారు. మరో అడుగు ముందుకేసి జిల్లా నాయకత్వానికి సూచనలు చేయబోయారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ మూడు స్థానాలు మాత్రమే గెలిచిందని గుర్తు చేస్తూ మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో సోమిరెడ్డికి కాస్త మండింది.
తమ నాయకత్వంతో టీడీపీ ఓటమి పాలైందన్న విషయాన్ని ఆనం గుర్తు చేస్తున్నారన్న కోపమో ఏమో గానీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ”రామనారాయణరెడ్డి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాలే గెలిచిందంటున్నారు. మరి 1989లో ఆయన టీడీపీలోనే ఉన్నారు. ఆ సమయంలో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు కదా” అని రివర్స్ పంచ్ వేశారు. అదే 1994కు వచ్చే సరికి ఆనం బ్రదర్స్ కాంగ్రెస్‌లోకి వెళ్లినా టీడీపీ నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు గెలించిందని గుర్తు చేశారు సోమిరెడ్డి. దీంతో ఆనం కాసింత ఇబ్బంది పడ్డారు. చివరకు ఆనం బ్రదర్సే తగ్గి మాట్లాడాల్సి వచ్చింది. ఒకప్పుడు కింగ్‌లా బతికిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు సామంత రాజులుగా ఉండేందుకు కూడా సిద్ధపడ్డారన్న మాట.
Click to Read: