మిథున్ రెడ్డి అరెస్ట్
వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి చేశారన్న కేసులో ఈ అరెస్ట్ జరిగింది. అనంతరం శ్రీకాళహస్తి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఎంపీని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఎంపీ అరెస్ట్ నేపథ్యంలో అవాంచనీయ సంఘటనలు జరగవచ్చన్న ఉద్దేశంతో అర్థరాత్రి పోలీసులు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. ఆరుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు […]

వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దాడి చేశారన్న కేసులో ఈ అరెస్ట్ జరిగింది. అనంతరం శ్రీకాళహస్తి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఎంపీని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఎంపీ అరెస్ట్ నేపథ్యంలో అవాంచనీయ సంఘటనలు జరగవచ్చన్న ఉద్దేశంతో అర్థరాత్రి పోలీసులు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. ఆరుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పుంగనూరు పీఎస్ వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు.