రైలులో టాయ్‌లెట్‌కు వెళ్లడం నిషిద్ధమా?
భారత రైల్వేలో నడుస్తున్న ఒక దురాచారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏకంగా వ్యవహారం ఎన్‌హెచ్‌ఆర్సీకి చేరింది. సమస్య ఏమిటంటే… రైల్వేలో ప్రస్తుతం 19వేలకు పైగా రెళ్లు ఉన్నాయి. 69 వేల మంది రైళ్లు నడిపే లోకో పైలట్స్ ఉన్నారు. వీరు 12 గంటల పాటు నిరంతరాయంగా డ్యూటీలో ఉంటారు. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ సమయమే డ్యూటీలో ఉండాల్సి ఉంటుంది. అయితే సమస్య అది కాదు. ఈ 12 గంటల సమయంలో లోకో పైలట్స్ టాయ్‌లెట్‌కు వెళ్లే అవకాశం లేదు. వన్ […]
భారత రైల్వేలో నడుస్తున్న ఒక దురాచారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏకంగా వ్యవహారం ఎన్‌హెచ్‌ఆర్సీకి చేరింది. సమస్య ఏమిటంటే… రైల్వేలో ప్రస్తుతం 19వేలకు పైగా రెళ్లు ఉన్నాయి. 69 వేల మంది రైళ్లు నడిపే లోకో పైలట్స్ ఉన్నారు. వీరు 12 గంటల పాటు నిరంతరాయంగా డ్యూటీలో ఉంటారు. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ సమయమే డ్యూటీలో ఉండాల్సి ఉంటుంది. అయితే సమస్య అది కాదు. ఈ 12 గంటల సమయంలో లోకో పైలట్స్ టాయ్‌లెట్‌కు వెళ్లే అవకాశం లేదు. వన్ అయినా టూ అయినా 12 గంటలు భరించాల్సిందే.
ఎన్నో ఏళ్లుగా ఈ నిబంధన అమలవుతోంది. ఇటీవల మహిళా లోకో పైలట్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇక వారి పరిస్థితి వర్ణణాతీతం. 12 గంటల పాటు బిగబట్టుకుని బతకాల్సిందే. ఇంతకాలం దీన్ని మౌనంగా భరించిన లోకో పైలట్స్ ఇప్పుడు జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నిబంధన బారి నుంచి కాపాడాలని వేడుకున్నారు. దీనిపై రైల్వే శాఖను ఎన్‌హెచ్‌ఆర్సీ వివరణ కోరగా దిమ్మతిరిగే సమాధానం వచ్చింది.
పనివేళ్లలో మూత్రవిసర్జనకు లోకో పైలట్స్ వెళ్తే రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఉంటుందని … మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థే దెబ్బతింటుందని దిక్కుమాలిన సమాధానం చెప్పింది. రైల్వే ఆవిర్భావం నుంచి ఈ దారుణం కొనసాగుతోంది. దీని వల్ల వేలాది మంది లోకో పైలట్స్ ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయారు. రోడ్లపై నడిచే వాహనాలైతే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆపాలని రూల్ ఉంది. విమానంలో అయితే మధ్యలో టాయ్‌లెట్ వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆగడం ఎవరి తరం కాదు. కానీ రైల్వేలో మాత్రం వస్తే వెళ్లకూడదంటూ ఈ దురాచారం నడుస్తోంది.