ఆకు కూడా బాబుదే... జగన్ గొప్ప శాస్త్రవేత్త: ఆనం
టీడీపీలో చేరుతున్న సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆనం వివేకానందరెడ్డి చంద్రబాబును కొత్త పోలికలతో పొగిడేశారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడి వంట వండుతున్నారని చెప్పారు. ఆ వంటనే రాష్ట్ర్ర ప్రజలు తింటున్నారన్నారు. విందు వడ్డించేందుకు ఆకులు కూడా చంద్రబాబే స్వయంగా కుడుతున్నారని ఆకాశానికి ఎత్తేశారు. విజభన ఒక శాపమైతే చంద్రబాబు సీఎంగా రావడం, జగన్ సీఎం కాకపోవడం ఒక అదృష్టమన్నారు. పూర్వకాలం దక్ష యజ్ఞం ఎందుకు చేశారో తనకు తెలియదు గానీ… చంద్రబాబు మాత్రం రాష్ట్రం […]
టీడీపీలో చేరుతున్న సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆనం వివేకానందరెడ్డి చంద్రబాబును కొత్త పోలికలతో పొగిడేశారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడి వంట వండుతున్నారని చెప్పారు. ఆ వంటనే రాష్ట్ర్ర ప్రజలు తింటున్నారన్నారు. విందు వడ్డించేందుకు ఆకులు కూడా చంద్రబాబే స్వయంగా కుడుతున్నారని ఆకాశానికి ఎత్తేశారు. విజభన ఒక శాపమైతే చంద్రబాబు సీఎంగా రావడం, జగన్ సీఎం కాకపోవడం ఒక అదృష్టమన్నారు.
పూర్వకాలం దక్ష యజ్ఞం ఎందుకు చేశారో తనకు తెలియదు గానీ… చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసం యజ్ఞం చేస్తున్నారని చెప్పారు. ”మన జగన్ పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మాక్స్ ఆర్థిక సిద్ధాంతాలు కూడా జగన్ ఆర్థిక సిద్ధాంతాల ముందు పనికిరావు” అన్నారు. కౌటిల్యుడి సిద్ధాంతాల్లో పెట్టుబడి అన్నది ఉంటుందని… జగన్ ఆర్థిక శాస్త్రంతో మాత్రం పెట్టుబడి లేకుండా లక్ష కోట్లు సంపాదన సాధ్యమవుతుందన్నారు. కృషి చేస్తే మనుషులు రుషులవుతారన్న కొటేషన్ గుర్తు చేస్తూ రాష్ట్ర్ర ప్రజలు కృషి చేస్తే చంద్రబాబులు అవుతారని కొత్త డైలాగ్ చెప్పారు ఆనం వివేకా.
Click on Image to Read: