సహజనటి కథ చక్కబెట్టింది అతడే... టార్గెట్ వారే..!
సహజనటిగా పేరుగాంచిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీలో చేరిపోయారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బయటకు ఇది హఠాత్తుగా జరిగిన పరిణామంగానే కనిపిస్తున్నా చాలాకాలంగానే టీడీపీ నుంచి జయసుధకు సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా జయసుధను టీడీపీలోకి తీసుకురావడంలో ఎంపీ మురళీమోహన్ కీలక పాత్ర పోషించారు. చాలా కాలంగా జయసుధ, మురళీ మోహన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. మొన్నటి ”మా” ఎన్నికల్లో మురళీ మోహన్ వర్గం నుంచి జయసుధ నేరుగా […]
సహజనటిగా పేరుగాంచిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీలో చేరిపోయారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బయటకు ఇది హఠాత్తుగా జరిగిన పరిణామంగానే కనిపిస్తున్నా చాలాకాలంగానే టీడీపీ నుంచి జయసుధకు సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా జయసుధను టీడీపీలోకి తీసుకురావడంలో ఎంపీ మురళీమోహన్ కీలక పాత్ర పోషించారు. చాలా కాలంగా జయసుధ, మురళీ మోహన్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. మొన్నటి ”మా” ఎన్నికల్లో మురళీ మోహన్ వర్గం నుంచి జయసుధ నేరుగా బరిలో దిగారు. అయితే రాజేంద్రప్రసాద్ చేతిలో ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచే టీడీపీలో చేరాల్సిందిగా మురళీమోహన్ ఒప్పిస్తూ వచ్చారు.
టీడీపీలోకి వస్తే అన్ని విధాలుగా బాగుంటుందని ఒప్పించారు. తన కొడుకును సినీ హీరోగా నిలబెట్టాలనుకుంటున్న జయసుధ ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ అండ అవసరమని భావించారని చెబుతున్నారు. పైగా కాంగ్రెస్‌లో ఆమెకు ఇటీవల ప్రాధాన్యత చాలా తగ్గిపోయింది. అప్పట్లో తన కుమారుడు నటించిన ”బస్తీ” సినిమా పంక్షన్‌కు కేసీఆర్‌ను ఆహ్వానించారు జయసుధ. దీంతో జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరిపోతారని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతల బుజ్జగింపులతో ఆమె అప్పట్లో వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు ఆమెను ఒప్పించడంలో విజయం సాధించారు. జయసుధను పార్టీలోకి తీసుకోవడం వెనుక టీడీపీ లెక్కలు టీడీపీకి ఉన్నాయని చెబుతున్నారు.
క్రిస్టియన్ అయిన జయసుధకు సికింద్రాబాద్ ఏరియాలో మంచి సంబంధాలున్నాయి. పైగా సికింద్రాబాద్ ఏరియాలో క్రిస్టియన్ ఓటర్లు అధికం. కాబట్టి గ్రేటర్ ఎన్నికల వేళ జయసుధను పార్టీలోకి తీసుకుంటే సికింద్రాబాద్ ప్రాంతంలో క్రిస్టియన్ ఓట్లను సులువగా రాబట్టుకోవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చూడాలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి జయసుధ ఎంత వరకు ఉపయోగపడుతారో!.
Click to Read: