కాజల్ ను వదిలిపెట్టండి చరణ్ బాబు
మగధీరతో రామ్ చరణ్ కు తెగ నచ్చేసింది కాజల్. అప్పట్నుంచి కాజల్ ను చెర్రీ సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడు. ఎంత సెంటిమెంట్ గా ఫీలయితే మాత్రం పదేపదే తన సినిమాల్లో ఆమెనే తీసుకుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు… చెర్రీకి టేస్ట్ లేదనుకుంటారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా కాజల్ నే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట చరణ్. మెగా ఫ్యాన్స్ కు ఇది నిజంగా చేదువార్తే. చెర్రీ సరసన ప్రెష్ గా మరో భామను చూద్దామనుకున్న […]
BY sarvi15 Jan 2016 12:34 AM IST

X
sarvi Updated On: 15 Jan 2016 5:40 AM IST
మగధీరతో రామ్ చరణ్ కు తెగ నచ్చేసింది కాజల్. అప్పట్నుంచి కాజల్ ను చెర్రీ సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడు. ఎంత సెంటిమెంట్ గా ఫీలయితే మాత్రం పదేపదే తన సినిమాల్లో ఆమెనే తీసుకుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు… చెర్రీకి టేస్ట్ లేదనుకుంటారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా కాజల్ నే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట చరణ్. మెగా ఫ్యాన్స్ కు ఇది నిజంగా చేదువార్తే. చెర్రీ సరసన ప్రెష్ గా మరో భామను చూద్దామనుకున్న అభిమానులకు మళ్లీ తెరపై కాజలే ప్రత్యక్షమైతే పాత ఆవకాయ పచ్చడినే మళ్లీ మళ్లీ చప్పరిస్తున్నట్టు అనిపిస్తుంది. మగధీర తర్వాత ఎవడు, నాయక్, గోవిందుడు అందరివాడేలే…. ఇలా వరుసగా 3 సినిమాల్లో కాజల్ తో కలిసి నటించాడు. ఆమధ్య మెరుపు అనే సినిమా మాయమైపోయింది లేకుంటే… ఆ మూవీ కూడా జాబితాలో చేరేది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా కాజల్ నే ట్రైచేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. చెర్రీ బాబు… కాజల్ ను వదిలిపెట్టు బాబు.
Next Story