మాయమైన నాన్నకు ప్రేమతో!
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్టుగా తయారైంది జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పరిస్థితి. ఎన్టీఆర్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నా టీడీపీ నేతల రాజకీయాల కారణంగా చివరకు కొన్ని ప్రాంతాల్లో అసలు బొమ్మే లేకుండా పోయింది. తొలి రోజు ఎక్కువ థియేటర్లలో నాన్నకు ప్రేమతో విడుదలైంది. అయితే డిక్టేటర్ రాగానే పరిస్థితి తారుమారైంది. హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న నాన్నకు ప్రేమతో తప్పించేశారు. ఆ స్క్రీన్లపై బాలయ్య బొమ్మను వేశారు. ముఖ్యంగా సీమ జిల్లాల్లో టీడీపీ […]
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్టుగా తయారైంది జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పరిస్థితి. ఎన్టీఆర్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నా టీడీపీ నేతల రాజకీయాల కారణంగా చివరకు కొన్ని ప్రాంతాల్లో అసలు బొమ్మే లేకుండా పోయింది. తొలి రోజు ఎక్కువ థియేటర్లలో నాన్నకు ప్రేమతో విడుదలైంది. అయితే డిక్టేటర్ రాగానే పరిస్థితి తారుమారైంది. హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న నాన్నకు ప్రేమతో తప్పించేశారు. ఆ స్క్రీన్లపై బాలయ్య బొమ్మను వేశారు. ముఖ్యంగా సీమ జిల్లాల్లో టీడీపీ నేతలు దగ్గరుండి వ్యవహారం నడిపారు.
కలెక్షన్ల పరంగా బాగా డ్యామేజ్ చేసేందుకు గ్రౌండ్ లెవన్ నుంచి నరుక్కొచ్చారు. ఒకటి రెండు థియేటర్లు ఉండే మండల కేంద్రాల్లో నాన్నకు ప్రేమతో సినిమా దాదాపు కనుమరుగైంది. రెండు థియేటర్లు ఉన్న మండల కేంద్రాల్లో ఒక చోట డిక్టేటర్ ఆడుతుంటే మరో థియేటర్‌లో సొగ్గాడే చిన్నినాయన లేదంటే ఎక్స్‌ప్రెస్ రాజా ఆడుతున్నాయి. ఇతర సినిమాలు ఆడినా పర్వాలేదుగానీ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఆడేందుకు వీలులేదన్నట్టు వ్యవహారం నడిచింది. జిల్లా కేంద్రాలు, ఐదుకు మించి థియేటర్లు ఉన్న చిన్నచిన్న పట్టణాల్లో మాత్రమే జూనియర్ సినిమా చూసే అవకాశం ఉంది. మండల కేంద్రాల్లో బొమ్మ మాయం చేశారు. ఇలా పరిస్థితి తయారవడానికి కారణం ఎవరన్నది తెలిసినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే బాలయ్య తరపున నేరుగా అధికార పార్టీ నేతలే రంగంలోకి దిగడంతో ఎదురుచెప్పే సాహసం చేయలేకపోతున్నారు.
Click to Read: