Telugu Global
Others

జగన్ వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటున్న కాంగ్రెస్

వైసీపీ బలహీనతపై టీ కాంగ్రెస్ కన్నేసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ ప్రకటించడమే ఆలస్యం కాంగ్రెస్ సీనియర్లు వ్యూహాలకు పదును పెట్టారు. వైసీపీ పోటీ చేసి ఉంటే గ్రేటర్‌లో ఆ పార్టీకి కొద్దిశాతం మేరనైనా ఓట్లు వచ్చేవి. వైఎస్‌ పథకాలను చూసి కావచ్చు మరే కారణాలతో కావచ్చు కొద్దిమేర ఓట్లు పోలయ్యేవి. ఇప్పుడు వైసీపీ పోటీ చేయకపోవడంతో ఈ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే వైఎస్‌ను పొడిగేస్తున్నారు. గ్రేటర్ […]

జగన్ వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటున్న కాంగ్రెస్
X

వైసీపీ బలహీనతపై టీ కాంగ్రెస్ కన్నేసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ ప్రకటించడమే ఆలస్యం కాంగ్రెస్ సీనియర్లు వ్యూహాలకు పదును పెట్టారు. వైసీపీ పోటీ చేసి ఉంటే గ్రేటర్‌లో ఆ పార్టీకి కొద్దిశాతం మేరనైనా ఓట్లు వచ్చేవి. వైఎస్‌ పథకాలను చూసి కావచ్చు మరే కారణాలతో కావచ్చు కొద్దిమేర ఓట్లు పోలయ్యేవి. ఇప్పుడు వైసీపీ పోటీ చేయకపోవడంతో ఈ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే వైఎస్‌ను పొడిగేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి … వైఎస్‌ను ఆకాశానికెత్తేశారు.

హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్ చాలా కృషి చేశారని చెప్పారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ సహకారంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. పేదలకు 76 వేల ఇళ్లు, కృష్ణా జలాలు తీసుకురావడం వంటి వాటిని వైఎస్‌ హయాంలోనే చేశామని గుర్తు చేశారు. ఇలా హఠాత్తుగా వైఎస్‌ను కాంగ్రెస్ నేతలు గ్రేటర్‌లో పొగడం వెనుక వైసీపీ ఓటు బ్యాంకును హస్తగతం చేసుకునే వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. గ్రేటర్‌ ఫైట్‌ టఫ్‌గా సాగుతున్న వేళ ప్రతి ఓటు విలువైనదే. వైసీపీ పోటీ చేయకపోవడంతో ఆ ఓట్లు టీఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీలకు మళ్లకుండా ఉండేందుకే కాంగ్రెస్ నేతలు వైఎస్‌ను పొడుగుతున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Click to Read:

chandrababu-naidu-idupulapaya

First Published:  15 Jan 2016 4:16 AM IST
Next Story