Telugu Global
Others

లోకల్‌లో నూరిపోయాలని చంద్రబాబు ఆదేశం

పోరాటంలో స్థానబలం కూడా చాలా ముఖ్యమంటారు. ఇప్పుడు టీడీపీకి కూడా ఇది వర్తిస్తోంది. రాష్ట్ర విభజనతో పాటు ఓటుకు నోటు వంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ అగ్రనాయకత్వం అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోతోంది. చంద్రబాబు ఇటీవల ఒక బహిరంగసభ నిర్వహించినా కేసీఆర్‌ను గానీ, టీఆర్‌ఎస్‌ను గానీ బలంగా విమర్శించలేకపోయారు. అసలు గ్రేటర్‌లో ప్రచారంపై టీడీపీకి పట్టుదొరకడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త ఎత్తు ప్రయోగిస్తున్నారు. సంక్రాంతికి సీమాంధ్రులు సొంతూరు వెళ్లడాన్ని క్యాష్‌ చేసుకునే పనిలో […]

లోకల్‌లో నూరిపోయాలని చంద్రబాబు ఆదేశం
X

పోరాటంలో స్థానబలం కూడా చాలా ముఖ్యమంటారు. ఇప్పుడు టీడీపీకి కూడా ఇది వర్తిస్తోంది. రాష్ట్ర విభజనతో పాటు ఓటుకు నోటు వంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ అగ్రనాయకత్వం అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోతోంది. చంద్రబాబు ఇటీవల ఒక బహిరంగసభ నిర్వహించినా కేసీఆర్‌ను గానీ, టీఆర్‌ఎస్‌ను గానీ బలంగా విమర్శించలేకపోయారు. అసలు గ్రేటర్‌లో ప్రచారంపై టీడీపీకి పట్టుదొరకడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త ఎత్తు ప్రయోగిస్తున్నారు.

సంక్రాంతికి సీమాంధ్రులు సొంతూరు వెళ్లడాన్ని క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలు సీమాంధ్ర ఓటర్లను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారన్న నిర్ధారణకు చంద్రబాబు వచ్చారట. అందుకే సంక్రాంతికి సొంతూరు వెళ్లిన సీమాంధ్ర( టీడీపీ అనుకూలవర్గాలను) ఓటర్లను అక్కడే మోటివ్ చేయాలని చంద్రబాబు ఆయా జిల్లాల టీడీపీ నేతలకు ఫోన్లు చేసి ఆదేశించారట. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నేతలకు ఫోన్లు చేసి ఈ ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. ఆరునూరైనా సరే టీడీపీకే ఓటేసేలా వారి మనసు మార్చాలని సూచించారట.

హైదరాబాద్‌లో టీడీపీ గెలిస్తేనే సీమాంధ్రులకు రక్షణ ఉంటుందని నూరిపోయాలని ఆదేశించారని చెబుతున్నారు. అయితే సీమాంధ్రుల రక్షణ అన్న పదాన్ని వాడడం మాత్రం కరెక్ట్ కాదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన జరిగి 18 నెలలు దాటినా ఇప్పటి వరకు హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు చిన్నపాటి ఇబ్బంది కూడా రాలేదు. అలాంటప్పుడు ”రక్షణ” అన్న పదాన్ని చంద్రబాబు పదేపదే ఎందుకు వాడుతున్నారో అర్థం కావడం లేదని సీమాంధ్ర ఓటర్లే అభిప్రాయపడుతున్నారు.

First Published:  15 Jan 2016 12:56 AM GMT
Next Story