ఎంతమార్పు!- హరీష్ ఫొటో కూడా లేదు!. "నన్ను అడగొద్దు"
కేసీఆర్ వారసులెవరన్న దానిపై గ్రేటర్ ఎన్నికల వేళ క్లారిటీ వస్తోంది పార్టీ నేతలకు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూశాక కేసీఆర్ వారసుడు కేటీఆరేనన్న నిర్ధారణకు నేతలొచ్చేశారు. హరీష్ కూడా ఈ విషయంలో మానసికంగా సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. నేతలు ఇలా ఫిక్స్ అయిపోతుండడానికి ఇటీవల అధినాయకత్వం నుంచి అందిన సంకేతాలే కారణమంటున్నారు నేతలు. ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ తరపున ముందుండి శ్రేణులను నడిపించే హరీష్ రావు గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆరే దూరంగా […]
కేసీఆర్ వారసులెవరన్న దానిపై గ్రేటర్ ఎన్నికల వేళ క్లారిటీ వస్తోంది పార్టీ నేతలకు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూశాక కేసీఆర్ వారసుడు కేటీఆరేనన్న నిర్ధారణకు నేతలొచ్చేశారు. హరీష్ కూడా ఈ విషయంలో మానసికంగా సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. నేతలు ఇలా ఫిక్స్ అయిపోతుండడానికి ఇటీవల అధినాయకత్వం నుంచి అందిన సంకేతాలే కారణమంటున్నారు నేతలు.
ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ తరపున ముందుండి శ్రేణులను నడిపించే హరీష్ రావు గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆరే దూరంగా పెట్టారట. ఇటీవల జిల్లా అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనే గ్రేటర్ ఎన్నికల సంగతి కేటీఆర్ చూసుకుంటారని కేసీఆర్ ప్రకటించారట. నారాయణఖేడ్ ఉప ఎన్నికల సంగతి హరీష్‌రావు చూసుకుంటారని చెప్పారు. దీంతో నేతలకు అప్పుడే స్పష్టత వచ్చేసింది.
హరీష్‌ను మెదక్ జిల్లాకు పరిమితం చేస్తున్నారని నేతలు నిర్ధారణకు వచ్చారు. అందుకే గ్రేటర్ ఎన్నికల మాటే హరీష్‌రావు నోట రావడం లేదు. కొందరు ఆశావహులు హరీష్ దగ్గరకు వెళ్లి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలని కోరారట. అయితే గ్రేటర్ టికెట్లగురించి తనను అడగవద్దని హరీష్ నిర్మొహమాటంగా చెబుతున్నారట. గ్రేటర్ పరిధిలో ఉన్న మెదక్ జిల్లా వార్డుల విషయంలోనూ హరీష్ జోక్యం జీరో అంటున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో హరీష్‌ను పక్కన పెట్టారన్న అంచనాకు వచ్చిన నేతలు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఫ్లెక్సీల్లో హరీష్‌రావు ఫోటోను కూడా పెట్టడం మానేశారు. హరీష్ ఫోటో పెడితే ఇతర నాయకులకు కోపమొస్తుందేమోనన్న అనుమానంతో ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ పరిణామంపై హరీష్ బయటపడడం లేదు. గుంభనంగానే ఉంటున్నారు.
Click to Read: