త్రిషా కోసం కలవరించిన క్రికెటర్
సినిమా నటీమణులకు, క్రికెటర్ స్టార్లకు మధ్య చాలా ఈజీగా రిలేషన్ కలిసిపోతుంటుంది. ఇప్పటికే చాలామంది జంటలుగా తిరుగుతున్నారు. తాజాగా క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్… హీరోయిన్ త్రిష అంటే ఎంత ఇష్టమో బయటపెట్టాడు. తమిళ టెలివిజన్ షోకు గెస్ట్‌గా హాజరైన అశ్విన్ తనకు త్రిష అంటే విపరీతమైన ఇష్టమని చెప్పారు. ఆమె కోసం ఎనిమిదో తరగతిలోనే ఏకంగా ప్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేశానని చెప్పాడు. స్నేహితుల నుంచి త్రిష ఫోటోలను సేకరించేవాడట. తమిళ చిత్రం ”లేసా లేసా” చూశాక […]

సినిమా నటీమణులకు, క్రికెటర్ స్టార్లకు మధ్య చాలా ఈజీగా రిలేషన్ కలిసిపోతుంటుంది. ఇప్పటికే చాలామంది జంటలుగా తిరుగుతున్నారు. తాజాగా క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్… హీరోయిన్ త్రిష అంటే ఎంత ఇష్టమో బయటపెట్టాడు. తమిళ టెలివిజన్ షోకు గెస్ట్‌గా హాజరైన అశ్విన్ తనకు త్రిష అంటే విపరీతమైన ఇష్టమని చెప్పారు. ఆమె కోసం ఎనిమిదో తరగతిలోనే ఏకంగా ప్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేశానని చెప్పాడు. స్నేహితుల నుంచి త్రిష ఫోటోలను సేకరించేవాడట. తమిళ చిత్రం ”లేసా లేసా” చూశాక త్రిషపై వన్‌సైడ్ లవ్ మొదలైందని చెప్పారు. ఇప్పటికీ తమిళ సినిమాలు అధికంగా చూస్తుంటానని చెప్పారు.