సంఖ్య సరే... స్థానాల సంగతేంటి?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ఒప్పందం కుదిరిందని సమాచారం. మొత్తం 150 డివిజన్లలో టీడీపీ 87, బీజేపీ 63 స్థానాల్లో పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. నేడు అభ్యర్థుల జాబితా కూడా విడుదలవుతుందని చెబుతున్నారు. అయితే ఏఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న దానిపై రెండు పార్టీ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఓడిపోయే సీట్లను తమకు అంటగట్టే […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటులో ఒప్పందం కుదిరిందని సమాచారం. మొత్తం 150 డివిజన్లలో టీడీపీ 87, బీజేపీ 63 స్థానాల్లో పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. నేడు అభ్యర్థుల జాబితా కూడా విడుదలవుతుందని చెబుతున్నారు. అయితే ఏఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలన్న దానిపై రెండు పార్టీ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఓడిపోయే సీట్లను తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రంగారెడ్డి అర్బన్‌లో బీజేపీకి నామమాత్రపు సీట్లను కేటాయించడంపైనా కమలనాథులు గుర్రుగా ఉన్నారు.