Telugu Global
Cinema & Entertainment

డిక్టేటర్ సినిమా రివ్యూ

రేటింగ్‌: 2.75/5 విడుదల తేదీ : 14 జనవరి 2016 దర్శకత్వం : శ్రీవాస్‌ ప్రొడ్యూసర్‌ : కిషోర్‌ లూల, సునీల్‌ లూల, అర్జున్‌ లూల, శ్రీవాస్‌ బ్యానర్‌: ఇరోస్ ఎంటర్ టైన్ మెంట్, వేదాశ్య క్రియేషన్స్ సంగీతం : తమన్‌ నటీనటులు : బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, రతి అగ్నిహోత్రి, సుమన్‌, పృధ్వీ, షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు…. సంక్రాంతి బాలయ్యకు కలిసొచ్చింతగా ఎవరికీ కలిసిరాలేదు. నటసింహానికి సక్సెస్ రేట్ కాస్త తక్కువే అయినప్పటికీ…. సంక్రాంతి […]

డిక్టేటర్ సినిమా రివ్యూ
X
రేటింగ్‌: 2.75/5
విడుదల తేదీ : 14 జనవరి 2016
దర్శకత్వం : శ్రీవాస్‌
ప్రొడ్యూసర్‌ : కిషోర్‌ లూల, సునీల్‌ లూల, అర్జున్‌ లూల, శ్రీవాస్‌
బ్యానర్‌: ఇరోస్ ఎంటర్ టైన్ మెంట్, వేదాశ్య క్రియేషన్స్
సంగీతం : తమన్‌
నటీనటులు : బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, రతి అగ్నిహోత్రి, సుమన్‌, పృధ్వీ, షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు….
సంక్రాంతి బాలయ్యకు కలిసొచ్చింతగా ఎవరికీ కలిసిరాలేదు. నటసింహానికి సక్సెస్ రేట్ కాస్త తక్కువే అయినప్పటికీ…. సంక్రాంతి సీజన్ వచ్చేసరికి మాత్రం అన్నీ అలా కలిసొస్తుంటాయి. ఈసారి కూడా అదే మేజిక్ రిపీట్ అయింది. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ జాబితాలోకి డిక్టేటర్ కూడా దాదాపు చేరిపోయినట్టే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడమే కాదు…. మాస్ జనాల్ని కూడా మెస్మరైజ్ చేస్తోంది.
సినిమా కథ –
ఢిల్లీలో పేరున్న ధ‌ర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీ అధిప‌తి చంద్ర‌శేఖ‌ర్ ధ‌ర్మా (బాల‌కృష్ణ‌). ఢిల్లీలో తెర వెన‌క ఉండి పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకుని ఆడిస్తూ… మాఫియాను ప్రోత్స‌హిస్తుంటుంది మ‌హిమారాయ్‌ (ర‌తీ అగ్నిహోత్రి). మ‌హిమ అల్లుడు చేసే అరాచ‌కాల‌కు అడ్డే ఉండ‌దు. వీరి అరాచ‌కాల‌ను అడ్డుకునే క్ర‌మంలో డిక్టేట‌ర్‌గా మారిన చంద్ర‌శేఖ‌ర్ ధ‌ర్మా వాళ్ల‌పై చేసే పోరాటంలో కొన్ని కోల్పోవాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ధర్మా… హైద‌రాబాద్‌ చేరుకుంటాడు. చందు పేరుతో ఓ సూప‌ర్ మార్కెట్‌లో ప‌ని చేస్తుంటాడు. హీరోయిన్ అవ్వాల‌నుకుని క‌ల‌లు కంటుండే సోనాల్ చౌహాన్‌కు బాల‌య్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. డ్ర‌గ్స్ మాఫియాకు చెందిన కొంద‌రు రౌడీలు సోనాల్‌ను కిడ్నాప్ చేస్తారు. సోనాల్ కోసం వెళ్లిన చందు అక్క‌డ జ‌రిగిన ఫైట్‌లో స్టేట్ మినిస్ట‌ర్ కొడుకుతో పాటు మొత్తం 24 మందిని చంపేస్తాడు. చందును పోలీసులు అరెస్టు చేస్తారు. అదే టైంలో స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ అజ‌య్ స‌హాయంతో చందును చంపేదుకు స్టేట్ మినిస్ట‌ర్‌, డ్ర‌గ్ ముఠా లీడ‌ర్ క‌లిసి ప్లాన్ చేస్తారు. చందు అరెస్టు తెలుసుకున్న ఢిల్లీలో ఉన్న సుమ‌న్ కూడా అదే స్పాట్‌కు వ‌స్తాడు. అక్క‌డ చందు గురించి తెలిసిన నిజం ఏమిటి ? అత‌డు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చి సూప‌ర్ మార్కెట్‌లో ఎందుకు ప‌ని చేస్తున్నాడు ? ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకుని దేశ రాజ‌కీయాల‌ను శాసించాల‌నుకున్న మ‌హిమారాయ్‌కు చందుతో ఉన్న వైరం ఎలాంటిది ? చివ‌ర‌కు స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగి ..ఎలా ముగిసింది అన్న‌దే మిగిలిన స్టోరీ.
నటీనటుల పనితీరు –
ఇది వంద‌కు వంద శాతం బాలయ్య చిత్రం. తనకు బాగా సెట్ అయిన కథలో బాలకృష్ణ రెచ్చిపోయాడు. తన మార్క్ పంచులు, ఫైట్లు, స్టెప్పులతో వన్ మేన్ షో చూపించాడు. అంజలి చక్కగా చేసింది. సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ డాల్ అనిపించింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులంతా తమ సహకారం అందించారు.
రివ్యూ –
నంద‌మూరి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఈ మూవీ. డిక్టేట‌ర్‌ని చూసి అభిమానులు ఈలలు వేసి గోల చేస్తూనే ఉన్నారు. త‌మ హీరో మ‌రోసారి సింహా, లెజెండ్‌గా రెచ్చిపోతుంటే వారు ఇంకేం ఆశిస్తారు.? ప‌వ‌ర్‌ఫుల్ సీన్‌లు, సీన్‌కి త‌గ్గ డైలాగులు, ప‌వ‌ర్‌ఫుల్ కేర‌క్ట‌రైజేష‌న్… ఇంకేం కావాలి.. కావాల్సినంత మసాలా అంతా సెట్ అయింది. డ్యాన్స్‌ల‌లో బాల‌య్య తనదైన డ్యాన్స్ చేశాడు. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం రక్తి కట్టించలేకపోయింది. సినిమాలో కొత్తదనం ఒక్క శాతం కూడా లేదు. కనీసం కామెడీ పండించడంలో కూడా శ్రీవాస్ సక్సెస్ కాలేపోయాడు. ఇది పూర్తిగా బాలకృష్ణ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా. తమన్ అందించిన సంగీతం అంతంతమాత్రంగానే ఉండడంతో… మూవీ రేటింగ్ ఇంకాస్త తగ్గిపోయింది. అయితే ఈ సంక్రాంతికి సిసలైన మాస్ సినిమాగా మాత్రం డిక్టేటర్ మిగులుతుంది. సినిమా ఏ రేంజ్ హిట్టో తెలియాలంటే… సోగ్గాడే చిన్ని నాయనా విడుదలైనంత వరకు వేచిచూడాల్సిందే.
First Published:  14 Jan 2016 6:35 AM IST
Next Story