Telugu Global
Others

ఎంత మార్పు ? " ఆ నిప్పులు ఏమయ్యాయి ?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. అటు అన్ని పార్టీలు బహిరంగ సభలు, ప్రచారాలలో హోరెత్తించాయి. బీజేపీ,టీడీపీ కూటమి నిజాం కాలేజీలో ఎన్నికల శంఖారావం పేరుతో నిర్వహించిన సభకు రెండు పార్టీల ముఖ్య నేతలతోపాలు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. సభా వేదికపై ఎంతమంది నాయకులున్నా.. అందరి దృష్టి ఏపీ సీఎం చంద్రబాబుపైనే. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ఎలాంటి విమర్శలు చేస్తారు? టీఆర్ఎస్ ను విమర్శిస్తారా? కేసీఆర్ పై ఆరోపణలు చేస్తారా? అని ఎదురు చూశారు. కానీ […]

ఎంత మార్పు ?  ఆ నిప్పులు ఏమయ్యాయి ?
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. అటు అన్ని పార్టీలు బహిరంగ సభలు, ప్రచారాలలో హోరెత్తించాయి. బీజేపీ,టీడీపీ కూటమి నిజాం కాలేజీలో ఎన్నికల శంఖారావం పేరుతో నిర్వహించిన సభకు రెండు పార్టీల ముఖ్య నేతలతోపాలు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. సభా వేదికపై ఎంతమంది నాయకులున్నా.. అందరి దృష్టి ఏపీ సీఎం చంద్రబాబుపైనే. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ఎలాంటి విమర్శలు చేస్తారు? టీఆర్ఎస్ ను విమర్శిస్తారా? కేసీఆర్ పై ఆరోపణలు చేస్తారా? అని ఎదురు చూశారు. కానీ చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా టీఆర్ఎస్ పార్టీని గాని, సీఎం కేసీఆర్ గానీ పల్లెత్తు మాట కూడా అనలేదు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన టీడీపీ మీటింగ్‌ల్లో కేసీఆర్‌పై ఒంటికాలితో లేచిన చంద్రబాబు నోట ఈసారి కేసీఆర్ అన్న పదం కూడా రాలేదు. కేసీఆర్‌పై ”ఇదిగో విరుచుకుపడుతారని” కార్యకర్తలు ఎదురుచూస్తుండగానే బాబు తన ప్రసంగం ముగించేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాదు…కనీసం నగరంలో ప్రస్తుతం ఉన్నసమస్యలను కూడా చంద్రబాబు ప్రస్తావించలేదు. కేవలం తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదారబాద్ లో చేసిన అభివృద్ధిని మాత్రమే చంద్రబాబు గుర్తు చేశారు.
తాను ఎక్కడికీ వెళ్లలేదని ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా తెలంగాణలో పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటానన్నది మాత్రమే చంద్రబాబు ప్రసంగంలో పంచ్‌ డైలాగ్. ఆతర్వాత హైదరాబాద్ కు అంతర్జాతీయస్థాయి బ్రాండ్ ఎలా తెచ్చానో చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రసంగంపై రాజకీయంగా అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ చిక్కుకున్న ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందన్న ప్రచారానికి చంద్రబాబు ప్రసంగం మరింత బలాన్నిచ్చిందని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఏదేమైనా చంద్రబాబు మాత్రం ఇటు కేసీఆర్ తో ఇబ్బందిరాకుండా చూసుకుంటూనే.. ఇటు గ్రేటర్ లో పార్టీకి ఉన్న పట్టును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది.
First Published:  13 Jan 2016 12:06 AM GMT
Next Story