Telugu Global
Others

కేటీఆర్‌, నాగ్‌ మధ్యలో సాక్షి- ఇది లైవ్ కాదేమో!

పరిచయాలు పెంచుకుంటూ అల్లుకుపోవడంలో నాగ్‌ను మించిన వారు టాలీవుడ్‌లో లేరు. పొలిటిషియన్లతో, ముఖ్యంగా పవర్‌లో ఉన్న వారికి దగ్గరవడంలో నాగ్‌ రూటే సపరేటు. లేటేస్ట్‌గా నాగార్జున .. టీ మంత్రి కేటీఆర్‌ను పడేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు ప్రకటించేశారు. సంక్రాంతికి విడుదలవుతున్న తన సినిమా సోగ్గాడే చిన్నినాయన చూడాలని కోరుతూనే కేటీఆర్‌ పనితీరును పొగిడేశారు. కేటీఆర్‌ వండర్‌ఫుల్ జాబ్ చేస్తున్నారని కితాబిచ్చారు. అదే సమయంలో పైరసీ నుంచి సినీ పరిశ్రమలకు కావాడాలని కేటీఆర్‌కు […]

కేటీఆర్‌, నాగ్‌ మధ్యలో సాక్షి- ఇది లైవ్ కాదేమో!
X

పరిచయాలు పెంచుకుంటూ అల్లుకుపోవడంలో నాగ్‌ను మించిన వారు టాలీవుడ్‌లో లేరు. పొలిటిషియన్లతో, ముఖ్యంగా పవర్‌లో ఉన్న వారికి దగ్గరవడంలో నాగ్‌ రూటే సపరేటు. లేటేస్ట్‌గా నాగార్జున .. టీ మంత్రి కేటీఆర్‌ను పడేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు ప్రకటించేశారు. సంక్రాంతికి విడుదలవుతున్న తన సినిమా సోగ్గాడే చిన్నినాయన చూడాలని కోరుతూనే కేటీఆర్‌ పనితీరును పొగిడేశారు. కేటీఆర్‌ వండర్‌ఫుల్ జాబ్ చేస్తున్నారని కితాబిచ్చారు. అదే సమయంలో పైరసీ నుంచి సినీ పరిశ్రమలకు కావాడాలని కేటీఆర్‌కు నాగ్ కోరారు. ఇందుకు స్పందించిన కేటీఆర్ కూడా నాగ్‌ను ఆకాశానికెత్తేశారు. తన టీనేజ్‌లో ”శివ” సినిమా విడుదలైందని అప్పటి నుంచే నాగార్జునకు తానో పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. పదేళ్లుగా తాను, నాగార్జున మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే?…

నాగ్‌, కేటీఆర్‌లను కలిపింది జగన్‌కు చెందిన సాక్షి టీవీ కావడం . జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సాక్షి చానల్‌ స్టూడియోకు వచ్చిన కేటీఆర్‌తో నాగార్జునను కలిపారు. అయితే నాగ్ మాట్లాడింది లైవ్‌లో కాదు. ముందు వెళ్లి నాగ్‌ దగ్గర బైట్ రికార్డు చేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. నాగ్‌ మాట్లాడడం పూర్తయిన తర్వాత కేటీఆర్‌ స్పందించారు. అయితే ఇలా నాగ్, కేటీఆర్‌ ఒకరినొకరు ప్రశంసించుకోవడం చూసేవారిని చాలా గమ్మత్తుగా అనిపించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలివైన ఎత్తులతో ముందుకెళ్తున్న కేటీఆర్‌కు నాగ్‌తో పరస్పర ప్రశంసలు కూడా బాగానే పనికొస్తాయని భావిస్తున్నారు. ఇది కూడా గ్రేటర్‌ ఎత్తే కాబోలు.

First Published:  13 Jan 2016 10:12 AM IST
Next Story