మా అమ్మాయికీ సినిమా చాన్స్ వచ్చింది.. ఓకే చెప్పా... కానీ
డిక్టేటర్ విడుదల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో బాలయ్య పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. సినిమాలు, రాజకీయాల మధ్య సమన్వయం చేసుకోవడంలో తన తండ్రి ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నానని బాలకృష్ణ చెప్పారు. తన తండ్రిలాగే తాను ఎమోషనల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని అన్నారు. రాజకీయాల్లో దూకుడుతనం అవసరమన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. వందో సినిమాపై మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. మనవడి ముందు సరదగా డ్యాన్సులు, ఫైటింగ్‌లు చేసి చూపిస్తుంటానని చెప్పారు. మనవడిని తొలుత […]
డిక్టేటర్ విడుదల సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరో బాలయ్య పలు ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. సినిమాలు, రాజకీయాల మధ్య సమన్వయం చేసుకోవడంలో తన తండ్రి ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నానని బాలకృష్ణ చెప్పారు. తన తండ్రిలాగే తాను ఎమోషనల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని అన్నారు. రాజకీయాల్లో దూకుడుతనం అవసరమన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. వందో సినిమాపై మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. మనవడి ముందు సరదగా డ్యాన్సులు, ఫైటింగ్‌లు చేసి చూపిస్తుంటానని చెప్పారు. మనవడిని తొలుత హీరోను చేసి రాజకీయాల్లోకి తీసుకొద్దామని బ్రహ్మణితో చెబుతుంటానని బాలయ్య వెల్లడించారు . అన్నింటిలో రాటుతేలేలా మనవడిని పెంచాలన్నది తన కోరికన్నారు.
రాజకీయంగా తాను ఏ పదవి చేపట్టాలన్నది కాలమే నిర్ణయిస్తుందని సీఎం పదవి గురించి బాలయ్య చెప్పారు. తన కూతుర్లు రాజకీయాల్లోకి వస్తామంటే తప్పకుండా ప్రోత్సహిస్తానన్నారు. బ్రహ్మణికి గతంలోనే మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. నటించాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని బ్రహ్మణితో చెప్పానన్నారు. అయితే సినిమాల్లో నటించడం ఇష్టం లేదని బ్రహ్మణి చెప్పిందన్నారు. రోజూ మూడున్నరకు లేస్తానని… లేవగాని చుట్టతాగుతానన్నారు. తన తండ్రి కూడా అలాగే చేసేవారన్నారు. సిగరేట్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని… చుట్ట తాగితే ఏమీకాదని తన హెల్త్ సీక్రెట్ గురించి చెప్పారు. ఫుడ్ విషయంలో ఎలాంటి ఆంక్షలు పాటించనన్నారు.
Click to Read: