తింటే సరిపోదు... కాసింత టచ్‌లో ఉండాలి..!
మనిషి బతకడానికి గాలి, నీరు, భోజనం, బట్టలు, ఇల్లు…ఇవే అత్యవసరాలని మనకు తెలుసు. కానీ వీటన్నింటితో పాటు రోజుకి ఓ నాలుగుసార్లు ఆప్యాయతతతో కూడిన ఆలింగనాలూ అవసరమే అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మానవ సంబంధాల్లో ప్రేమ, నమ్మకం బలమైనవని మనకు తెలుసు. ఆలింగనం వాటిని అక్షరాలా అనుభవంలోకి తెస్తుందంటున్నారు వారు. చిన్నతనంలో విరివిగా దొరికిన ఆ దగ్గరితనం పెద్దయ్యే కొద్దీ మనిషికి దూరమవుతూ ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా మనస్ఫూర్తిగా ఓదార్చి దగ్గరికి తీసుకునే అనుబంధాలు వయసు […]
మనిషి బతకడానికి గాలి, నీరు, భోజనం, బట్టలు, ఇల్లు…ఇవే అత్యవసరాలని మనకు తెలుసు. కానీ వీటన్నింటితో పాటు రోజుకి ఓ నాలుగుసార్లు ఆప్యాయతతతో కూడిన ఆలింగనాలూ అవసరమే అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మానవ సంబంధాల్లో ప్రేమ, నమ్మకం బలమైనవని మనకు తెలుసు. ఆలింగనం వాటిని అక్షరాలా అనుభవంలోకి తెస్తుందంటున్నారు వారు. చిన్నతనంలో విరివిగా దొరికిన ఆ దగ్గరితనం పెద్దయ్యే కొద్దీ మనిషికి దూరమవుతూ ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా మనస్ఫూర్తిగా ఓదార్చి దగ్గరికి తీసుకునే అనుబంధాలు వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గుతుంటాయి. ఉత్తరాదిలో కనిపించినంతగా మన దక్షిణాది ప్రాంతాల్లో ఈ సంప్రదాయం మనకు కనిపించదు. కౌగిలింతలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వారు వెల్లడించిన కౌగిలింతల థెరపీ వివరాలు ఇవీ-
- మనిషి ఆరోగ్యంగా జీవించి ఉండటానికి రోజుకి నాలుగుసార్లు ఆత్మీయ ఆలింగనాలు అవసరం.
- రోజులో సవ్యంగా పనులు చేసుకుపోవడానికి ఎనిమిది ఆలింగనాలు కావాలి.
- మనిషిలో ఎదుగుదల, అభివృద్ధికి పన్నెండుసార్లు ఆత్మీయ స్పర్శ ఉండాలి.
- జీవిత భాగస్వామి, ప్రేమించేవారి ఆత్మీయ టచ్‌తో అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
- ఒత్తిడికి కౌగిలింత మంచి మందట. ప్రేమతో కూడిన ఆలింగనంతో మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒత్తిడి హార్మోను కార్టిసాల్ స్థాయి వెంటనే తగ్గుతుంది.
- ఆలింగనాన్ని అలా కాసేపు కొనసాగిస్తే సంతోషానికి కారణమైన సెరటోనిన్ స్థాయి పెరుగుతుంది. మనసు ఉల్లాసంగా మారుతుంది.
- ఆత్మీయ స్పర్శతో ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరుగుతాయి. ఒంటరితనం, ఆందోళన తగ్గుతాయి.
- ఎక్కువగా ఆలింగనం చేసుకునే మహిళలకు రక్తంలో ప్రేమ హార్మోన్ ఆక్సిటోసిన్ స్థాయి పెరుగుతుంది.
- కౌగిలింతల వలన, స్ట్రెస్ కారణంగా కలుగుతుందని భావిస్తున్న వైరల్ ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
- ఆలింగనం రక్తప్రసరణని పెంచుతుంది, నొప్పిని తగ్గించి టెన్షన్‌ని నివారిస్తుంది.
- హగ్‌తో అనవసరమైన భయాలు తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి.