Telugu Global
Others

నిఘా వర్గాల హెచ్చరిక- సీఎం భద్రతకు గజ ఈతగాళ్లు, సీఆర్‌పీఎఫ్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతపై నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. సీఎంకు భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సీఎం ప్రయాణించే హెలికాప్టర్, విమానాన్ని ముందుగా తనిఖీ చేయాలని సూచించింది. ముఖ్యంగా కృష్ణా నది ఒడ్డున ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్ విషయంలో నిఘా వర్గాలు మరింత అప్రమత్తం చేశాయి. లింగమనేని గెస్ట్‌హౌస్ నది ఒడ్డున ఉండడంతో నది వెంబడి భద్రత ఉంచాలని సూచించింది.మెకనైజ్డ్‌ బోట్‌లు ఏర్పాటు చేసి దానిలో గజ ఈతగాళ్లను […]

నిఘా వర్గాల హెచ్చరిక- సీఎం భద్రతకు గజ ఈతగాళ్లు, సీఆర్‌పీఎఫ్
X

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతపై నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. సీఎంకు భద్రతను మరింత పెంచాలని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సీఎం ప్రయాణించే హెలికాప్టర్, విమానాన్ని ముందుగా తనిఖీ చేయాలని సూచించింది. ముఖ్యంగా కృష్ణా నది ఒడ్డున ఉన్న చంద్రబాబు గెస్ట్‌హౌస్ విషయంలో నిఘా వర్గాలు మరింత అప్రమత్తం చేశాయి. లింగమనేని గెస్ట్‌హౌస్ నది ఒడ్డున ఉండడంతో నది వెంబడి భద్రత ఉంచాలని సూచించింది.మెకనైజ్డ్‌ బోట్‌లు ఏర్పాటు చేసి దానిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచి 24 గంటల పాటు పహారా ఉంచాలని ఇంటెలిజెన్స్ సూచించింది. స్విమ్మింగ్ నెట్‌తో పాటు సీఎం భద్రత కోసం సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించాలని హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు క్షణం తీరికలేకుండా పర్యటనలు చేస్తుండటంవల్ల, నది ఒడ్డున ఉన్న గెస్ట్‌హౌస్‌లో స్టే చేయడంవల్ల ఇంటెలిజెన్స్‌ సూచించిన విధంగా భద్రతా ఏర్పాట్లు చెయ్యాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బు చంద్రబాబు భద్రతకే సరిపోయేలా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Click to Read:

chandrababu-chambar

First Published:  12 Jan 2016 3:30 AM IST
Next Story