Telugu Global
Others

వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు నచ్చదా?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. దాంతో తెలుగుమీడియాలో మెజారిటీ వర్గం వైసీపీ మీద విమర్శలకు దిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని గెలిపించడానికే వైసీపీ రంగంలోకి దిగడంలేదని, టీఆర్‌ఎస్‌కి , వైసీపీకి మధ్య ఈమేరకు ఒక లోపాయికారి ఒప్పందం కుదిరిందని వార్తలు రాశారు.  గతంలో వైసీపీ వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికలో పోటీచేసినప్పుడు ఇదే మీడియా కేసీఆర్‌ని గెలిపించడానికే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఈమేరకు వైసీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం […]

వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు నచ్చదా?
X

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయించుకున్నట్టు వార్తలొచ్చాయి. దాంతో తెలుగుమీడియాలో మెజారిటీ వర్గం వైసీపీ మీద విమర్శలకు దిగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని గెలిపించడానికే వైసీపీ రంగంలోకి దిగడంలేదని, టీఆర్‌ఎస్‌కి , వైసీపీకి మధ్య ఈమేరకు ఒక లోపాయికారి ఒప్పందం కుదిరిందని వార్తలు రాశారు.

గతంలో వైసీపీ వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికలో పోటీచేసినప్పుడు ఇదే మీడియా కేసీఆర్‌ని గెలిపించడానికే వైసీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఈమేరకు వైసీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని వార్తలు రాశారు.

వైసీపీ ఎలాంటి రాజకీయనిర్ణయాలు తీసుకున్నా బురదచల్లడానికి సిద్ధంగా వుండే ఈ మీడియా వర్గాలను అడిగి ప్రతి నిర్ణయం తీసుకోవాలా? అని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

First Published:  11 Jan 2016 6:42 AM IST
Next Story