రాజ్యసభకు లోకేష్?
యువనేత లోకేష్‌కు బాధ్యతాయుతమైన పదవి అప్పగించేందుకు టీడీపీలో జోరుగా కసరత్తు జరుగుతోంది. లోకేష్‌కు ఏ పదవి అయితే బాగుంటుందన్న దానిపై చంద్రబాబు పలువురు సీనియర్లతో మంతనాలు జరిపారు. తాజాగా లోకేష్‌ను రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. దీనిపై ప్రసారమాధ్యమాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. లోకేష్‌ను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకుని ఐటీ మంత్రిని చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఢిల్లీ స్థాయి పదవితో చట్టసభల్లోకి ఎంటరయితే బాగుంటుందన్న అభిప్రాయానికి అధినేత వచ్చారని చెబుతున్నారు. హస్తిన స్థాయిలో […]
యువనేత లోకేష్‌కు బాధ్యతాయుతమైన పదవి అప్పగించేందుకు టీడీపీలో జోరుగా కసరత్తు జరుగుతోంది. లోకేష్‌కు ఏ పదవి అయితే బాగుంటుందన్న దానిపై చంద్రబాబు పలువురు సీనియర్లతో మంతనాలు జరిపారు. తాజాగా లోకేష్‌ను రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. దీనిపై ప్రసారమాధ్యమాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. లోకేష్‌ను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకుని ఐటీ మంత్రిని చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఢిల్లీ స్థాయి పదవితో చట్టసభల్లోకి ఎంటరయితే బాగుంటుందన్న అభిప్రాయానికి అధినేత వచ్చారని చెబుతున్నారు. హస్తిన స్థాయిలో పరిచయాలు పెంచుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను నడపడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు.
కేవలం రాజ్యసభతో సరిపెట్టకుండా కేంద్ర కేబినెట్‌లోకి కూడా చినబాబును చేర్చేలా వ్యూహరచన చేస్తున్నారట. లోకేష్ రాజ్యసభకు వెళ్లదలుచుకుంటే ఎవరూ అడ్డుచెప్పే పరిస్థితి లేకపోయినా ఏపీ నుంచి టీడీపీకి దక్కే మూడు రాజ్యసభ స్థానాలను ఎవరెవరితో భర్తీ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. కేంద్రమంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ ఇద్దరి పదవి కాలం ఏప్రిల్‌లో ముగుస్తోంది. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న జేడీ శీలం, జైరాం రమేష్ పదవి కాలం కూడా అదేసమయంలో ముగుస్తోంది. ఈ నాలుగు స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కుతాయి. మూడుస్థానాల్లో సుజనా, నిర్మల సీతారామన్‌కు రెన్యువల్ తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే వారి మంత్రి పదవులకు ఇబ్బంది వస్తుంది. ఒకవేళ లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయాలనుకుంటే సుజనాకు అవకాశం దక్కకపోవచ్చు అంటున్నారు. వీరే కాకుండా ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లేందుకు వెంకయ్యనాయుడు, యనమల రామకృష్ణుడు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా లోకేష్‌బాబును రాజ్యసభకు పంపుతారా లేక మరో ఆలోచన చేస్తారా అన్నది తేలాలంటే మరికొద్ది నెలలు ఆగాలి.