Telugu Global
Others

గ్రేటర్ ప్రచార బరిలో ఇద్దరు చంద్రులు

ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్ చంద్రబాబు సఖ్యతగా మెలుగుతున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. కేసీఆర్ చండీయాగం కోసం బెజవాడ వెళ్లి పిలిస్తే చంద్రబాబు హాజరయ్యారు. అప్పటి నుంచి అటు టీటీడీపీ నుంచి ఇటు టీఆర్ఎస్ నుంచి ఇద్దరిపై విమర్శల దాడి కూడా తగ్గింది. కానీ గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు ఇద్దరి మధ్య మరోసారి చిచ్చు పెడతాయా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు […]

గ్రేటర్ ప్రచార బరిలో ఇద్దరు చంద్రులు
X
ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్ చంద్రబాబు సఖ్యతగా మెలుగుతున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. కేసీఆర్ చండీయాగం కోసం బెజవాడ వెళ్లి పిలిస్తే చంద్రబాబు హాజరయ్యారు. అప్పటి నుంచి అటు టీటీడీపీ నుంచి ఇటు టీఆర్ఎస్ నుంచి ఇద్దరిపై విమర్శల దాడి కూడా తగ్గింది. కానీ గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు ఇద్దరి మధ్య మరోసారి చిచ్చు పెడతాయా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు టీడీపీ-బీజేపీ కూటమి కూడా ఎలాగైనా గ్రేటర్ లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
టీఆర్ఎస్ తరుఫున గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ కూడా వస్తున్నారు. ఆయన రెండు లేదా మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారని మంత్రి కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబును కూడా తెలంగాణ టీడీపీ నాయకులు గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావాలని ఒత్తిడి చేశారు. అయితే టీటీడీపీ నాయకుల ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే బీజేపీ మాత్రం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందేనని చంద్రబాబుపై ఒత్తిడి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబు ప్రచారానికి వచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. చివరి నాగులు రోజుల ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. బాబు రెండు లేదా నాలుగు బహిరంగ సభలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. బాబు వెంట కేంద్రమంత్రి వెంక‌య్య నాయుడు కూడా ఉంటారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూట‌మికి ఓట్లు ప‌డాలంటే టీఆర్ఎస్ పాలనను చంద్రబాబు విమర్శించక తప్పదు. అయితే చంద్రబాబు కేవలం హైదరాబాద్ లో తాను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటారా? లేదంటే టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు మొదటి నుంచి గ్రేటర్ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సొంతపార్టీ నేతలే అంటున్నారు. అందుకే ఆయన ఈ విషయంపై అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఒత్తిడితో ప్రచారానికి వచ్చినా అధికార టీఆర్ఎస్ పై విమర్శలు చేయకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
First Published:  11 Jan 2016 6:08 AM IST
Next Story