మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ రానుందా?
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ రానుందా.. అంటే అవుననే అంటుంది ఫిలిం నగర్. మెగా ఫ్యామిలి పేరుకు తగ్గట్టుగానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక నటులున్న ఫ్యామిలిగా మెగా ఫ్యామిలి పేరు తెచ్చుకుంది. దాదాపు 8 మంది హీరోలున్న ఈ ఫ్యామిలీ నుంచే హీరోయిన్ గా నాగాబాబు కూతురు నిహారిక రాబోతున్న విషయం తెలిసిందే. అదే కుటుంబం నుంచి ఇప్పుడు మరో హీరోయిన్ రావటానికి త్వరలోనే మెగాస్టార్ కూతురు శ్రీజ సైతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా […]
BY sarvi11 Jan 2016 5:36 AM IST
X
sarvi Updated On: 11 Jan 2016 7:06 AM IST
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ రానుందా.. అంటే అవుననే అంటుంది ఫిలిం నగర్. మెగా ఫ్యామిలి పేరుకు తగ్గట్టుగానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక నటులున్న ఫ్యామిలిగా మెగా ఫ్యామిలి పేరు తెచ్చుకుంది. దాదాపు 8 మంది హీరోలున్న ఈ ఫ్యామిలీ నుంచే హీరోయిన్ గా నాగాబాబు కూతురు నిహారిక రాబోతున్న విషయం తెలిసిందే. అదే కుటుంబం నుంచి ఇప్పుడు మరో హీరోయిన్ రావటానికి త్వరలోనే మెగాస్టార్ కూతురు శ్రీజ సైతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా చెలామణి అవ్వటం కోసం అన్ని రకాల ట్రైనింగ్స్ తీసుకుంటుందని సమాచారం. ఇందులో భాగంగానే ఫేమస్ కొరియోగ్రాఫర్ మెహర్ మాలిక్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటునట్టు సమాచారం. ఇప్పటి వరకూ మెహర్ మాలిక్ వద్ద ట్రైనింగ్ తీసుకున్న వారు అంతా ఇండస్ట్రీ హీరోయిన్స్..అలాగే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న హీరోయిన్స్ మాత్రమే.
Next Story