నానీ సినిమా ఆడియోకి టైమ్ ఫిక్స్
‘అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్. అయిదు రోజుల క్రితం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వేడిలోనే పాటల్ని విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం జనవరి 18కి ముహూర్తం ఖరారు చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, […]

‘అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్. అయిదు రోజుల క్రితం విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వేడిలోనే పాటల్ని విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం జనవరి 18కి ముహూర్తం ఖరారు చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మురళీశర్మ, సంపత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదలవనుంది.