సంక్రాంతికి ముందు వస్తే చావే...
సంక్రాంతికి బడా సినిమాలు లైన్లో ఉన్నాయి. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాల మధ్య నడుస్తున్న వార్…. సిసలైన మజానిస్తోంది. దీనికి తోడు సోగ్గాడే చిన్ని నాయనా, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు కూడా కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ లో…. ఎప్పట్లానే మరో శుక్రవారం వచ్చింది. ఈ శుక్రవారం కూడా సినిమాలు విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల దృష్టి అంతా సంక్రాంతి సినిమాలపై ఉండడంతో… ఇదొక […]
BY sarvi10 Jan 2016 12:34 AM IST
X
sarvi Updated On: 10 Jan 2016 10:34 AM IST
సంక్రాంతికి బడా సినిమాలు లైన్లో ఉన్నాయి. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాల మధ్య నడుస్తున్న వార్…. సిసలైన మజానిస్తోంది. దీనికి తోడు సోగ్గాడే చిన్ని నాయనా, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు కూడా కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ లో…. ఎప్పట్లానే మరో శుక్రవారం వచ్చింది. ఈ శుక్రవారం కూడా సినిమాలు విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకుల దృష్టి అంతా సంక్రాంతి సినిమాలపై ఉండడంతో… ఇదొక శుక్రవారం ఉందనే విషయాన్నే అంతా మరిచిపోయారు. అలా ఈనెల 9వ తేదీన శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
పాకశాల, తస్కర, కవ్వింత, దిల్ రాజులాంటి 9 సినిమాలు ఈ శుక్రవారం (జనవరి 9) థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో కొన్ని సినిమాలకైతే మల్టీప్లెక్సులు, ప్రైమ్ థియేటర్లు కూడా దొరికాయి. కాస్త డబ్బు కలిగిన నిర్మాతలు… వీటిలో కొన్ని సినిమాలకు ప్రచారం కూడా బాగానే చేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ తొమ్మిదింటిలో ఒక్కదాన్నీ పట్టించుకోలేదు. ఓవైపు సంక్రాంతి సినిమాల కోసం వెయిట్ చేసే వాళ్లు ఉంటే… మరోవైపు కిల్లింగ్ వీరప్పన్ కోసం ఎగబడేవారు ఎక్కువయ్యరు. దీంతో మధ్యలో వచ్చిన ఈ 9 సినిమాల్ని పట్టించుకునే నాధుడే లేడు.
Next Story