Telugu Global
Others

జూనియర్‌కు జగన్‌ మద్దతు !

నందమూరి సినిమా వార్‌లో ఆసక్తికరమైన కోణాలు కనిపిస్తున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమాకు థియేటర్లు దొరక్కుండా లోకేష్ అండ్‌ టీం రంగంలోకి దిగిందని జూనియర్ అభిమానులు లోలోన ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయంపై జగన్‌కు చెందిన సాక్షి పత్రిక గత‌ రెండు రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతు అన్నట్టుగా కథనాలు ఉంటున్నాయి. లోకేష్ అండ్ టీం జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాను దెబ్బతీసేందుకు కుట్రలుచేస్తున్నారని బహిరంగంగానే కథనాలు రాస్తోంది. ఏఏ జిల్లాల్లో ఏఏ […]

జూనియర్‌కు జగన్‌ మద్దతు !
X

నందమూరి సినిమా వార్‌లో ఆసక్తికరమైన కోణాలు కనిపిస్తున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమాకు థియేటర్లు దొరక్కుండా లోకేష్ అండ్‌ టీం రంగంలోకి దిగిందని జూనియర్ అభిమానులు లోలోన ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయంపై జగన్‌కు చెందిన సాక్షి పత్రిక గత‌ రెండు రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతు అన్నట్టుగా కథనాలు ఉంటున్నాయి. లోకేష్ అండ్ టీం జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాను దెబ్బతీసేందుకు కుట్రలుచేస్తున్నారని బహిరంగంగానే కథనాలు రాస్తోంది. ఏఏ జిల్లాల్లో ఏఏ థియేటర్ యజమాన్యాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్న విషయాన్ని కూడా ప్రచురిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి ఒక గొంతుకలా, మద్దతుగా సాక్షి ఇప్పుడు ముందుకెళ్తోంది. అది కూడా మొదటిపేజీలో బ్యానర్ ఐటమ్‌గా నందమూరి వార్‌ గురించి కథనాలు రాసింది. జరుగుతున్న వ్యవహారాలపై కథనాలు ప్రసారంచేయడం మీడియా బాధ్యత. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే జూనియర్‌కు మద్దతుగా సాక్షి కథనాల వల్ల అటు ఎన్టీఆర్‌తో పాటు ఇటు జగన్‌ కూడా కొన్ని అంశాల్లో కలిసొచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ,లోకేష్, బాలయ్య ఫ్యాన్స్ ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న ”నాన్నకు ప్రేమతో”కు సాక్షి సపోర్ట్‌గా ఉండడం వల్ల జూనియర్‌ ఎన్టీఆర్, హరికృష్ణ అభిమానుల్లో జగన్‌పై సానుకూల వైఖరి ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎన్టీఆర్‌పై జరుగుతున్న అనైతిక పోరాటం బయటి ప్రపంచానికి తెలియడం వల్ల ఎన్టీఆర్‌ పైనా జనంలో సానుభూతి ఏర్పడే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా ఆ స్థానంలో ఎన్టీఆరేకాకుండా మరెవరున్నా వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశం మంచిదే.

Click to Read:

jr-ntr-balakrishna

caste-intolerance-in-ap

First Published:  9 Jan 2016 6:31 PM IST
Next Story