Telugu Global
Others

రేవంత్ నోట "బలి" మాట ఎందుకొచ్చింది?

టీటీడీపీలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ కలిసిపోయారట కదా అని ప్రశ్నించగా రేవంత్ తెలంగాణలో టీడీపీ కోసం ఎన్నోకుటుంబాలు నెత్తురు చిందిచాయని చెప్పారు. వారి తాగ్యాలను కేసీఆర్‌ కాళ్ల వద్ద చంద్రబాబు పెడుతారనుకోవడం భ్రమేనన్నారు. కేసీఆర్‌లాంటి కసాయి వాడికి కేడర్‌ను చంద్రబాబు బలి ఇస్తారనుకుంటే అది కూడా టీఆర్‌ఎస్‌ భ్రమేనన్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఒక హెచ్చరికతరహా సందేశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో […]

రేవంత్ నోట బలి మాట ఎందుకొచ్చింది?
X

టీటీడీపీలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ కలిసిపోయారట కదా అని ప్రశ్నించగా రేవంత్ తెలంగాణలో టీడీపీ కోసం ఎన్నోకుటుంబాలు నెత్తురు చిందిచాయని చెప్పారు. వారి తాగ్యాలను కేసీఆర్‌ కాళ్ల వద్ద చంద్రబాబు పెడుతారనుకోవడం భ్రమేనన్నారు. కేసీఆర్‌లాంటి కసాయి వాడికి కేడర్‌ను చంద్రబాబు బలి ఇస్తారనుకుంటే అది కూడా టీఆర్‌ఎస్‌ భ్రమేనన్నారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఒక హెచ్చరికతరహా సందేశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నో కుటుంబాలు పార్టీ కోసం నెత్తురు చిందించాయి కాబట్టి టీఆర్‌ఎస్‌ విషయంలో దూరాన్ని పాటించాలని పరోక్షంగా చంద్రబాబుకు రేవంత్ సూచించారని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌పై టీడీపీ నేతల పోరాటం బలహీనపడిందన్న అభిప్రాయం ఉంది. కానీ ఒక్కరేవంత్ మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, కేసీఆర్‌ కలిసిపోయారన్న ప్రచారం అందరి కంటే ఎక్కువగా రేవంత్‌ను బాధిస్తోంది. అందుకే కేసీఆర్‌తో చేతులు కలిపారనే అభిప్రాయం జనంలో బలపడితే అది కేడర్‌ను కేసీఆర్‌కు బలి ఇచ్చినట్టే అవుతుందని రేవంత్ భావనగా చెబుతున్నారు.

First Published:  9 Jan 2016 10:22 AM IST
Next Story