Telugu Global
NEWS

సిట్‌ అధికారి జడ్జిని ఎందుకు కలిశారు, ఇది వందశాతం విషప్రయోగమే!

విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కల్తీ మద్యం కేసులో అరెస్టయిన మల్లాది విష్ణు విషయంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి సమావేశంలో వాగ్వాదానికి దిగారు. మల్లాది విష్ణుకు అండగా పార్టీ ఎందుకు నిలవలేదని పీసీసీచీఫ్ రఘువీరారెడ్డి ఇతర పార్టీ పెద్దలను ఒక వర్గం కార్యకర్తలు నిలదీశారు. మరోవర్గం మల్లాది విష్ణుకు వ్యతిరేకంగా నినాదాలుచేసింది. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో కల్తీ మద్యం […]

సిట్‌ అధికారి జడ్జిని ఎందుకు కలిశారు, ఇది వందశాతం విషప్రయోగమే!
X

విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. కల్తీ మద్యం కేసులో అరెస్టయిన మల్లాది విష్ణు విషయంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి సమావేశంలో వాగ్వాదానికి దిగారు. మల్లాది విష్ణుకు అండగా పార్టీ ఎందుకు నిలవలేదని పీసీసీచీఫ్ రఘువీరారెడ్డి ఇతర పార్టీ పెద్దలను ఒక వర్గం కార్యకర్తలు నిలదీశారు. మరోవర్గం మల్లాది విష్ణుకు వ్యతిరేకంగా నినాదాలుచేసింది. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో కల్తీ మద్యం మరణాల వెనుక ప్రభుత్వ హస్తముందని ఆరోపించారు. మల్లాది విష్ణును రాజకీయంగా దెబ్బతీయడానికి టీడీపీ నాయకులే మద్యంలో విషం కలిపారని ఆరోపించారు. ఇది వంద శాతం విషప్రయోగమేనన్నారు.

మల్లాది విష్ణు రిమాండ్‌పై తీర్పు రావడానికి గంట ముందు సిట్ అధికారి న్యాయమూర్తిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. న్యాయమూర్తి చాంబర్‌కు వెళ్లి సిట్ అధికారి ఏం మాట్లాడారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణలో నిజాయితీ లోపించిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని రఘువీరా ఆరోపించారు. విజయవాడలో టీడీపీకి కంటిలో నలుసులా తయారయ్యాడన్న ఉద్దేశంతో విష్ణును లొంగదీసుకునేందుకు చాలా కాలంగా ప్రభుత్వపెద్దలు ప్రయత్నిస్తున్నారని రఘువీరా ఆరోపించారు. అది సాధ్యం కాకపోవడంతో చివరకు విషప్రయోగానికి పూనుకున్నారని మండిపడ్డారు.

First Published:  9 Jan 2016 8:33 AM IST
Next Story