Telugu Global
CRIME

అప్పు ఎగ్గొట్టిన కళానికేతన్ ఎండీ అరెస్ట్

హైదరాబాద్ లో ప్రముఖ వస్త్ర దుకాణాల్లో ఒకటైన కళానికేతన్ ఎండీ లీలాకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు భార్య లక్ష్మిని కూడా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీఎస్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 3కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. లీలాకుమార్ కేవలం ఏవీఎస్ రెడ్డినే కాదు.. సుమారు 8బ్యాంకులను కూడా మోసం చేసినట్టు గుర్తించారు. […]

అప్పు ఎగ్గొట్టిన కళానికేతన్ ఎండీ అరెస్ట్
X
హైదరాబాద్ లో ప్రముఖ వస్త్ర దుకాణాల్లో ఒకటైన కళానికేతన్ ఎండీ లీలాకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు భార్య లక్ష్మిని కూడా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవీఎస్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 3కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిశాయి. లీలాకుమార్ కేవలం ఏవీఎస్ రెడ్డినే కాదు.. సుమారు 8బ్యాంకులను కూడా మోసం చేసినట్టు గుర్తించారు. తప్పుడు ఫోర్జరీ పత్రాలతో బ్యాంకుల నుంచి సుమారు 300 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
హైదరాబాద్‌లో 5 బ్యాంకుల నుంచి, విజయవాడలో 2 బ్యాంకులు, గుంటూరులో ఒక బ్యాంకు నుంచి లీలా కుమార్ దంపతులు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఆ రుణాలు కూడా ఒకే భూమికి చెందిన పత్రాలను ఫోర్జరీ చేసి వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇప్పటికే లీలా కుమార్ కు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించడం లేదని తెలుస్తోంది.
లీలా కుమార్ ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకులో ఆస్తులు తనఖా పెట్టినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని రిజర్వ్‌బ్యాంకుకు కూడా సమాచారం ఇచ్చారు. ఈనేపథ్యంలో ఏవీఎస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో లీలాకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
First Published:  8 Jan 2016 6:31 PM IST
Next Story