ఖాకీ కావరం " యువతుల రహస్య ప్రదేశాల్లో కారం చల్లి చిత్రహింసలు
మహారాష్ట్ర్రలో ఇద్దరు యువతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. ఒక అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టారు. కాంత్రిచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 31 రాత్రి ఆరుగురు స్నేహితులు కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు యువతులు మినహా మిగిలిన వారంతా మద్యం సేవించారు. అయితే మద్యం ఎక్కువయ్యే సరికి వారిలో ఒకతను దురుసుగా ప్రవర్తించడం […]
మహారాష్ట్ర్రలో ఇద్దరు యువతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. ఒక అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టారు. కాంత్రిచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 31 రాత్రి ఆరుగురు స్నేహితులు కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు యువతులు మినహా మిగిలిన వారంతా మద్యం సేవించారు. అయితే మద్యం ఎక్కువయ్యే సరికి వారిలో ఒకతను దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. దారి మధ్యలోనూ డోస్ ఎక్కువైన వ్యక్తి మరోసారి రచ్చచేయబోయాడు. రోడ్డు మీద పరుగులు పెట్టాడు. ఆ సమయంలో కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించేలోపు అతడు చనిపోయాడు.
ఈ కేసులో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారు. ఒక మహిళా పోలీస్ అధికారి ఇద్దరు యువతుల దుస్తులు తొలగించి వారి ప్రైవేట్ పార్ట్స్‌లో కారం చల్లారు. ఆ సమయంలో అక్కడ మగ పోలీసులు కూడా ఉన్నారు. దీనిపై బాధితులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. తమ స్నేహితుడు కిందపడి చనిపోగా అందుకు విరుద్దంగా మరో ఇద్దరు మిత్రులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తమను పోలీసులు చిత్రహింసలు పెట్టారని యువతులు ఆరోపిస్తున్నారు.